అమ్మ ఒడి పథకం కింద విద్యార్థిని బడికి పంపే ప్రతి తల్లికి, ఏటా 15 వేల రూపాయలను ప్రభుత్వం అందజేయనుంది. రెండు రోజుల క్రితం అమ్మ ఒడి పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలలో చదివే విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుందని ఆర్థిక శాఖా మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ప్రకటించారు. విద్యాశాఖా మంత్రి గారు కూడా ఆయననే బలపరిచే విధంగా మాట్లాడారు. తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం దానికి విరుద్ధమైన ప్రకటనను విడుదల చేసింది.
అమ్మ ఒడి పథకాన్ని పిల్లల్ని బడికి పంపే ప్రతి తల్లికి వర్తింపజేయనున్నట్లు, పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా వారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. పాదయాత్రలో భాగంగా సిఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీని అనుసరించి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు కూడా ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల మెరుగుదలకు కూడా చర్యలు తీసుకోనున్నామని అందులో వివరించారు.
ఇవి కూడా చదవండి.
Post a Comment