చంద్రబాబు నాయుడు గారు విదేశీ పర్యటనకు వెళ్లారు.
యూరోప్‌కు వెళ్లారు.
విదేశాల నుండి టెలికాన్‌ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అనే వార్తలే వస్తున్నాయి. కాని, ఆయన ఏ దేశానికి వెళ్ళాడో మాత్రం రహస్యమే. ఆయన వ్యక్తిగత పర్యటనపై వెళ్ళినప్పుడు ఏ దేశం వెళ్లారో, ఏ పని కోసం వెళ్లారో ఎవరికీ చెప్పనవసరం లేదు. మనది వ్యక్తిగత గోప్యత అయినప్పుడు, అవతలి వారి గోప్యతను కూడా గౌరవించాలి కదా!
అదే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉండి లండన్ వెళ్ళినప్పుడు, నల్లధనాన్ని దాచుకోవడానికే వెళ్లాడని తెలుగుదేశం నేతలు, కొంతమంది మంత్రులు విమర్శించారు. ఒక పత్రిక ఆ ఆరోపణలకు విపరీత ప్రాధాన్యం ఇచ్చింది. దానితో అక్కడ చదువుకుంటున్న కుమార్తెను కలుసుకోవడానికి వెళ్లానని ఆయన వివరణ ఇవ్వవలసి వచ్చింది. అప్పుడు జగన్ నుండి వివరణ తీసుకున్న తెలుగు దేశం నాయకులకు, పత్రికకు కూడా, చంద్రబాబు ఏదేశానికెళ్లారో తెలియదు పాపం.
ఈ వ్యవహారంపై విజయసాయి రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా సెటైర్ కూడా వేశారు.
చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకూ తెలియదు. స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా? ఎల్లో మీడియా కూడా యూరప్ నుంచి ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని రాసింది. యూరప్ అనేది దేశం కాదు. 44 దేశాలున్న ఖండమని అందరికీ తెలుసు.— Vijayasai Reddy V (@VSReddy_MP) 22 June 2019
Post a Comment