భద్రాచలం తెలంగాణదే

భద్రాచలం పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చేస్తున్నారని వచ్చిన వార్తలను, తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఖండించారు. అటువంటి ప్రతిపాదన ఏదీ తమ ప్రభుత్వం వద్ద లేదని ఆయన స్పష్టంచేశారు. 

గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరువాత మంత్రి మీడియాతో మాట్లాడుతూ 'అలా అని మీకెవరు చెప్పారు?' అని ఎదురు ప్రశ్నించారు. వదంతులను నమ్మవద్దని, భద్రాచలం పట్టణం ఎన్నటికీ తెలంగాణదేనని, ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహమూ అవసరం లేదని తెలిపారు. భద్రాద్రి రాముడికి తెలంగాణ రాష్ట్రప్రభుత్వమే పట్టువస్త్రాలు సమర్పించే సాంప్రదాయం ఉందని గుర్తుచేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరికొకరు సహరించుకుంటూ, ఇరు రాష్ట్రాల అభివృద్ధికి కృషిచేస్తారని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి. 

0/Post a Comment/Comments