తెలంగాణలో బిజెపి బలపడే ప్రయత్నాలు

ఈశాన్య రాష్ట్రాలలో కాంగ్రెస్ మరియు ఇతర పార్టీ నేతలను ఆకర్షించి, బిజెపి బలపడడానికి కారణమైన రాంమాధవ్ గారు ఇప్పుడు హైదరాబాద్‌పై దృష్టిని కేంద్రీకరించారు. ఆయన  అనేకమంది టిడిపి, కాంగ్రెస్ నేతలను కలిసి, బిజెపిలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు.   

రామ్ మాధవ్ గారిని కలిసిన వారిలో మాజీ ఎంపీ వివేక్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన కాంగ్రెస్, టిఆర్ఎస్ రెండు పార్టీలపై అసంతృప్తితో ఉండడంతో ఆయన బిజెపిలో చేరే అవకాశం ఉంది. విశ్వేశ్వర్ రెడ్డి, రేవంత్ రెడ్డి మరియు రాజగోపాల్ రెడ్డిలు కూడా చేరుతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ, ఎవరూ ధృవీకరించలేదు. పైగా కోమటిరెడ్డి వెంకట రెడ్డి గారు తాను, తన సోదరుడు బిజెపిలో చేరుతున్నామన్న వార్తను ఖండించారు.  

తెలంగాణలో బిజెపి బలపడే ప్రయత్నాలు చేయడానికి కారణాలు      
  • లోక్‌సభ ఎన్నికలలో నాలుగు స్థానాలలో విజయం సాధించడం
  • కెసిఆర్ గారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తుండడంతో ఏర్పడిన రాజకీయ శూన్యత
  • ఢిల్లీలో సొంతంగా అధికారం సంపాదించడంతో వారికి ఇప్పుడు ప్రాంతీయ పార్టీల అవసరం లేకపోవడం
  • ఎంఐఎంతో టిఆర్ఎస్ దోస్తీని తమ భావజాల వ్యాప్తికి ఉపయోగించుకునే అవకాశముండడం 
బలపడడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాలేమిటి?

ముందుగా కాంగ్రెస్, టిడిపి నేతలతో మొదలుపెట్టి, కొంత బలపడిన తరువాత టిఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్త ఎమ్మెల్యేలను కూడా ఆకర్షించడం బిజెపి వ్యూహంగా కనిపిస్తుంది.   

నేతలను ఆకర్షించడమే కాకుండా ప్రజలలో కూడా బిజెపి బలాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యమించాలని క్యాడర్‌కు దిశా నిర్దేశం చేసింది. రాష్ట్రంలో ఎన్నికల సమయంలో కొంతవరకు పెంచుకున్న సోషల్ మీడియా  సిబ్బందిని మరింత పెంచుకుంది. గ్రామ స్థాయివరకు ఫేస్‌బుక్, వాట్స్ఆప్ గ్రూపులను విస్తరించడం ద్వారా తమ అతివాద హిందుత్వ భావజాలాన్ని వ్యాపింప చేయాలని భావిస్తుంది. 

కెసిఆర్ గారితో సంబంధాలు సరిగ్గా లేకపోవడం, ఇక్కడ తెలుగుదేశం పూర్తిగా పట్టు కోల్పోవడంతో అయోమయంలో ఉన్న రామోజీరావుగారి ద్వారా ప్రధాన మీడియాలో కూడా స్థానం సంపాదించుకుంది. అందుకే ఈనాడు పత్రికలో కొన్ని రోజులుగా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు ఊపందుకున్నాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post