జూన్ 13 మరియు 14వ తేదీలలో కిర్ఘిజిస్తాన్ రాజధాని బిష్‌కేక్‌లో జరగనున్న SCO సదస్సుకు వెళ్లేందుకు, పాకిస్తాన్ గగనతలంపై నుండి ప్రయాణించాలనుకున్న నరేంద్ర మోడీ గారు, చివరి క్షణాల్లో మనసు మార్చుకున్నారు. ఆయన ఒమన్, ఇరాన్ మరియు మధ్య ఆసియా దేశాలపై నుండి ప్రయాణించనున్నారు.
పాకిస్థాన్‌పై నుండి ప్రయాణించడానికి అభ్యర్థించి, ఆ దేశం అంగీకరించిన తరువాత భారత విదేశాంగ శాఖ ఈ ప్రకటనను విడుదల చేసింది. బాలాకోట్ దాడుల అనంతరం రెండు దేశాలు, అవతల దేశంనుండి వచ్చే విమానాలను నిషేధించాయి. మన దేశం మే 31న ఈ నిషేధాన్ని ఎత్తివేయగా, పాకిస్తాన్ మాత్రం కొనసాగిస్తుంది.
పాకిస్తాన్ గగనతలం మీదుగా విమాన ప్రయాణం చేయనున్నారన్న వార్తను కూడా ఇక్కడ చదవండి.
Post a Comment