మొత్తానికి రోజాగారికి పదవి దక్కింది.

మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తితో ఉన్న వైసిపి నేత, సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజాగారికి కీలకమైన నామినేటెడ్ పదవి దక్కింది. ఆమెను ఎపిఐఐసి (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఛైర్మన్‌గా నియమిస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ఫేస్‌బుక్‌ పేజీలో ఆమె ఈ విషయాన్ని ధృవీకరించారు. త్వరలో ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడనున్నాయి.  
 


మంగళవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, రోజాగారిని అమరావతిలోని తన కార్యాలయానికి పిలిపించుకుని చర్చలు జరిపారు. మంత్రి పదవి ఇవ్వలేకపోవడానికి కారణాలను వివరించి, ఆమెకు ప్రోటోకాల్ ఉన్న పదవిని ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలుస్తుంది.   

0/Post a Comment/Comments