సంవత్సరంలో అతి సుదీర్ఘమైన పగలు ఉండే రోజు - జూన్ 21

జూన్ 21వ తేదీ - సంవత్సరంలో  సుదీర్ఘమైన పగలు ఉండే రోజు. ఈ రోజుని వేసవి అయనాంతం (Summer Solstice) గా పరిగణిస్తారు. ఈ రోజునుండి రోజులో పగటి సమయం తగ్గిపోవటం ప్రారంభిస్తుంది. ఈ రోజు నుండి శీతల అయనాంతం (Winter Solstice - సాధారణంగా డిసెంబర్ 21) వరకు ఇలా జరుగుతుంది. అప్పటి నుండి తిరిగి వేసవి అయనాంతం వరకు రోజులో పగటి సమయం పెరుగుతూ వస్తుంది. ఈ ప్రత్యేకత దృష్ట్యానే, ఈ రోజును భారత ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎంపిక చేశారు. 

వేసవి అయనాంతం సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఆకాశంలో అత్యధిక ఎత్తును చేరుకున్న సమయాన్ని సూచిస్తుంది. ఇది ఎప్పుడూ జూన్ 21వ తేదీనే రాదు, అరుదైన సందర్భాలలో జూన్ 20న గాని, జూన్ 22న గాని కూడా వస్తుంది.

హిందూ పంచాగం ప్రకారం కూడా ఉత్తరాయణ, దక్షిణాయన కాలాలు ఉంటాయి. దక్షిణాయన కాలం కర్కాటక సంక్రాంతి రోజున (జులై 16న) ప్రారంభమవుతుంది. దక్షిణాయణాన్ని అసురకాలంగా, దేవతలకు రాత్రి సమయంగా పరిగణిస్తారు.

ఇది కూడా చదవండి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం. 

0/Post a Comment/Comments

Previous Post Next Post