నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. దీనిని ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన జరుపుకుంటారు. 2015 నుండి ఈ ఆనవాయితీ ప్రారంభమైంది. యోగా అనేది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసం. భారత దేశంలో ఇది శతాబ్దాల నుండి ప్రాచుర్యంలో ఉంది.
భారత ప్రధాని నరేంద్ర మోడీ యోగా దినోత్సవానికి జూన్ 21వ తేదీని సూచించారు. ఎందుకంటే ఇది ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలో అత్యధిక పగటి సమయాన్ని కలిగి ఉండే రోజు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) ద్వారా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఏకగ్రీవంగా ప్రకటించబడింది. భారత ప్రతినిధి బృందం 2014 అక్టోబర్ 14 న అంతర్జాతీయ యోగా దినోత్సవం అనే పేరుతో ముసాయిదా తీర్మానంపై UNGAలో సంప్రదింపులు ప్రారంభించింది. డిసెంబరు 11, 2014 న భారతదేశం యొక్క శాశ్వత ప్రతినిధి అశోక్ ముఖర్జీ దీని ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ ప్రతి 177 సభ్యుల నుండి సంపూర్ణ మద్దతును పొందింది.
ఇది కూడా చదవండి.
వేసవి అయనాంతం - సంవత్సరంలో అతి సుదీర్ఘమైన పగలు ఉండే రోజు
ఇది కూడా చదవండి.
వేసవి అయనాంతం - సంవత్సరంలో అతి సుదీర్ఘమైన పగలు ఉండే రోజు
Post a Comment