మహేష్ నవమి

జ్యేష్ఠ మాసములో శుక్ల పక్ష నవమి రోజున మహేష్ నవమి పండుగ జరుపుకుంటారు. ఈ రోజు మహేశ్వరి సమాజం యొక్క ఆవిర్భావ దినము. ఈ పండుగ శివపార్వతుల ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజున వారు  మత మరియు సాంస్కృతికపరమైన వేడుకలు జరుపుకుంటారు. 

మహేశ్వరి సమాజం పుట్టుకను వారు శివ దేవుని బహుమతి అని నమ్ముతారు. ప్రచారంలో ఉన్న నమ్మకం ప్రకారం, మహేశ్వరి సమాజంలోని పూర్వికులు క్షత్రియులు. ఒకానొక వేట సందర్భంలో మునుల శాపానికి గురవుతారు. ఈ మహేష్ నవమి రోజున పరమ శివుడు వీరిని ఆ శాపం నుండి విముక్తి గావించాడు. అప్పటి నుండి వీరు మహేశ్వరి సమాజంగా మారి క్షత్రియ కర్మను వదిలి, వ్యాపార కార్యకలాపాలను స్వీకరించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post