జొమాటో ద్వంద్వ ప్రమాణాలు???


ఆహారానికి మతం లేదు, ఆహారమే ఓ మతం అన్న జొమాటో ట్వీట్‌ సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చను లేవదీసింది. ఆ సంస్థ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తుందంటూ నెటిజన్లు విరుచుకు పడుతున్నారు. 

తనకు ఫుడ్ డెలివరీ చేసేందుకు హిందువును కాకుండా మరొకరిని పంపించడంపై ఒక యూజర్ అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా, ఆ ఆహారాన్ని తిరస్కరించారు. అమిత్ శుక్లా అనే ఆ వ్యక్తి (యూజర్ నేమ్: NaMo_SARKAAR) జొమాటోకు ఈ విషయంపై ట్వీట్ చేసి ఫిర్యాదు కూడా చేయగా ఆ సంస్థ రిఫండ్‌ను తిరస్కరించింది. పైగా ఆహారానికి మతం లేదు, ఆహారమే ఓ మతం అంటూ ట్వీట్ చేయడమే కాకుండా, ఆ యూజర్ వివరాలను కూడా బయటపెట్టింది. దీనిపై సోషల్ మీడియాలో అనుకూలంగా, మరియు వ్యతిరేకంగా భారీ ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.     

ముస్లింలు 'హలాల్'  మాంసాన్ని కోరుకున్నప్పుడు దానికి అనుగుణంగా హలాల్ ట్యాగ్‌ను అందిస్తున్నప్పుడు జొమాటో సంస్థకు గుర్తు రాని మతం, హిందువులు తమకు హిందూ డెలివరీ బాయ్ కావాలని అడిగితే మాత్రం మతం, సెక్యులరిజం గుర్తుకు వస్తున్నాయా? అంటూ ప్రశ్నిస్తున్నారు. పైగా హిందువులు, క్రిస్టియన్లు  వ్యతిరేకించే హలాల్ మాంసాన్ని కూడా అనేక సందర్భాల్లో వారికి సరఫరా చేస్తున్నారని కూడా విమర్శిస్తున్నారు. హలాల్ ట్యాగ్ లాగానే హిందూ ఓన్లీ రైడర్ ట్యాగ్ కూడా అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ నేపథ్యంలో మనదేశంలో ప్రజలు జొమాటో యాప్‌ను అన్-ఇన్స్‌టాల్ చేసుకోవటమే కాకుండా నెగెటివ్ రేటింగ్‌ను కూడా ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post