అమెరికాలో వి-అన్‌బీటబుల్ సంచలనం

ముంబయికి చెందిన డ్యాన్స్ గ్రూప్ 'కింగ్స్ యునైటెడ్' వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ కిరీటాన్ని గెలుచుకున్న తరువాత, అదే నగరానికి చెందిన మరో గ్రూప్ వి-అన్‌బీటబుల్ అమెరికా గాట్ ట్యాలెంట్ షోలో సంచలనం సృష్టిస్తోంది. తమ ఆశ్చర్యకరమైన ప్రదర్శనతో లాస్ ఏంజిల్స్‌లో లైవ్ షోలను ప్రదర్శించేందుకు ఎంపికయ్యారు.

ఈ డ్యాన్స్ బృందం ప్రదర్శనలు సాహసోపేతంగా, వళ్ళు గగుర్పొడిచే విన్యాసాలతో సాగుతున్నాయి. జడ్జెస్ కట్‌గా పేరుపొందిన ఇవాళ్టి షోలో వీరు ఏకంగా గోల్డెన్ బజర్ సాధించారు. ఇవాళ మొత్తం పదునెనిమిది ప్రదర్శనలలో కేవలం ఏడు మాత్రమే లైవ్ షోలకు ఎంపికయ్యాయి. కాగా, వీక్షకులను ఎక్కువ ఉత్సాహ పరచిన ప్రదర్శన మాత్రం నిస్సందేహంగా వి-అన్‌బీటబుల్స్ దేనని చెప్పవచ్చు.

ఎక్కువ మంది వి-అన్‌బీటబుల్ బృందాన్ని సమర్థిస్తున్నప్పటికీ కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. డ్యాన్స్ ప్రదర్శనల కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి విన్యాసాలు చేయడం అవసరమా? అని కొందరు, ఇప్పటికే కింగ్స్ ప్రదర్శించిన పాటలనే వీరు ఎంచుకుంటున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. తరువాతి రౌండ్ ప్రదర్శనలు జులై 30న జరుగనున్నాయి.

వి-అన్‌బీటబుల్స్ ఇవాళ్టి ప్రదర్శన



వీరి తొలి రౌండ్ ప్రదర్శన



'డేంజర్'గా పేరుగాంచిన సిఖ్ బృందం బిర్ ఖల్సా కూడా ఈ అర్హత సాధించడం విశేషం.

0/Post a Comment/Comments

Previous Post Next Post