సాహో మూవీ రివ్యూ - రేటింగ్

సాహూ (యూ / ఏ) - ర‌న్ టైం: 172 నిమిషాలు
విడుదల : 30 ఆగ‌స్టు, 2019
తారాగణం: ప‌్ర‌భాస్‌, శ్ర‌ద్ధాక‌పూర్‌, జాకీష్రాఫ్, నీల్‌నితిన్ ముఖేష్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీశ‌ర్మ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: మ‌ది
నేప‌థ్య సంగీతం: జిబ్రాన్‌
నిర్మాత‌లు: ప‌్ర‌మోద్ – వంశీ
క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: సుజీత్‌

సాహో - బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ జానర్‌లో, భారీ తారాగణంతో 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఇవాళ విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకుందా?, ఒకసారి సమీక్షిద్దాం.   

వాజీ సిటీతో ప్రారంభమయ్యే సినిమా, ముంబయిలో జరిగిన ఒక భారీ చోరీతో ఊపందుకుంటుంది. ఈ చోరీని ఇన్వెస్టిగేట్ చేసే అశోక్, అమృతా నాయర్‌ల మధ్య లవ్ ట్రాక్, వివిధ పాత్రలు పరిచయం అవుతూ ఉండటం జరుగుతుంది. మనదేశంలో ఇంకా ఎక్కువమంది ప్రేక్షకులు చూడకపోవడం వలన ట్విస్టులను బయటపెట్టడం లేదు. ఇంటర్వెల్‌కు ముందు, క్లైమాక్స్ సమయంలో వచ్చే సీన్లు ఆకట్టుకుంటాయి.       

నేను భారీ అంచనాలతో వెళ్లాను కాబట్టి, సినిమా కొంత నిరాశ పరిచిందనే చెప్పాలి. అంచనాలు లేకుండా వెళితే కొన్ని హాలీవుడ్ స్థాయి యాక్షన్ సీన్లను ఆస్వాదించవచ్చు. నటీనటులు వారి పాత్ర పరిధులలో బాగానే నటించారు. అక్కడక్కడా కామెడీ కూడా పండింది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. దర్శకుడు సుజిత్ సినిమా విషయంలో ట్విస్టులతో  స్క్రీన్ ప్లే రూపొందించుకున్నా, ప్రేక్షకుడిని కట్టిపడేయలేకపోయారు. విలన్ల సంఖ్య మరీ ఎక్కువవడం కూడా కథనాన్ని దెబ్బతీసింది. ప్రభాస్ శిఖరంపై నుండి దూకడం లాంటి సీన్లు కూడా అనవసరంగా అనిపిస్తాయి. తొంభయిల నాటి హాలివుడ్ సినిమాల తరహాలో డైలాగ్స్ తో కథ నడిపించే ప్రయత్నం చేశారు. అది మన తెలుగు ప్రేక్షకులకు నచ్చడం కష్టమే.

ప్ల‌స్ పాయింట్స్ (+)

– హాలివుడ్ స్థాయి యాక్షన్ సీన్లు, ఇంటర్వెల్ బ్యాంగ్‌, విజువల్స్, నేపథ్య సంగీతం, క్లైమాక్స్

మైన‌స్ పాయింట్స్ (-)

– స్టోరీలో లీనం చేయలేని స్క్రీన్ ప్లే, అసందర్భంగా అనిపించే పాటలు, సాగదీసినట్లుగా అనిపించే కథనం 

తెలుగు సినిమాలో ఇప్పటివరకు చూడని యాక్షన్ సీన్ల కోసమే ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. 

 రేటింగ్ :  ⭐️⭐️½  (2.5/5)

1/Post a Comment/Comments

Post a Comment

Previous Post Next Post