ఇది చారిత్రాత్మక విజయం దిశగా తొలి అడుగు


ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), మరో చారిత్రాత్మక విజయం దిశగా తొలి అడుగు వేసింది. ఇవాళ (జూలై 22, సోమవారం), చంద్రయాన్ -2 మిషన్‌లో భాగంగా మధ్యాహ్నం 14:43 సమయంలో జిఎస్ఎల్వి-3 నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో చంద్రుని చుట్టూ పరిభ్రమించే ఉపగ్రహం (ఆర్బిటార్), ల్యాండర్ మరియు రోవర్లు ఉన్నాయి. చంద్రునిపై ల్యాండింగ్ విజయవంతమైతే, సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ మరియు చైనాల తరువాత ఈ ఘనత సాధించిన నాలుగవ దేశంగా భారత్ నిలవనుంది. జూలై 15న జరుగవలసిన ఈ ప్రయోగం, సమయానికి  గంట ముందు వాయిదాపడిన విషయం తెలిసిందే. 


చంద్రయాన్ 2 ప్రయోగాన్ని మొదట ఇస్రో మరియు రష్యా స్పేస్ ఏజెన్సీ అయినా రోస్ కాస్మోస్ కలసి నిర్వహిద్దామనుకున్నాయి. 2011లో జరగవలసిన ఈ ప్రయోగానికి, రోస్ కాస్మోస్ ల్యాండర్‌ను అందించాలని, ఇస్రో ఆర్బిటర్ మరియు రోవర్‌లను రూపొందించాలని భావించాయి.

రూపకల్పన మరియు నిర్మాణంలో సహజంగా జరిగే జాప్యాలు, అలాగే రోస్ కాస్మోస్ యొక్క ఆర్థిక ఇబ్బందులు,ఈ ప్రయోగాన్ని 2013కి ఆలస్యం చేశాయి. 2011లో రష్యా సంస్థ యొక్క ఫోబోస్-గ్రంట్ మార్స్ ప్రోబ్ విఫలమవడం,  మరిన్ని ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టడం, రష్యా యొక్క ల్యాండర్ నిర్మాణాన్ని మరింత ఆలస్యం చేయడంతో, చంద్రయాన్ -2 మిషన్‌ 2015కి  వాయిదావేయబడింది.

2015 నాటికి కూడా ల్యాండర్ నిర్మాణం విషయంలో రోస్ కాస్మోస్ చేతులెత్తేయడంతో రష్యా, ఈ ప్రయోగం నుండి వైదొలిగినట్లయింది. అప్పుడు మనదేశమే స్వయంగా ల్యాండర్ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించుకుంది. దీనిని ముందుగా 2018 మార్చి నాటికి రూపొందించాలని భావించారు. కానీ, సాంకేతిక సమస్యల వలన ఈ ప్రయోగం మార్చి నుండి ఏప్రిల్‌కు, ఏప్రిల్ నుండి అక్టోబర్‌కు, అక్టోబర్ నుండి 2019 ఫిబ్రవరికి వాయిదా పడింది. ఫిబ్రవరిలో పరీక్ష సమయంలో లాండర్‌కు చిన్న నష్టం జరగడంతో జూలై 14 వరకు ప్రయోగం ఆలస్యమైంది. కాని, చివరి నిముషం ఇబ్బందులతో ఈ ప్రయోగం ఇవాళ సాధ్యమైంది.


రాకెట్ నుండి విడివడిన తరువాత, చంద్రయాన్ -2 నెమ్మదిగా భూమి నుండి కక్ష్య నుండి దూరంగా జరిగి, దాదాపు 30 రోజుల అనంతరం చంద్రుని కక్ష్యను చేరనుంది. 


ఆర్బిటార్ , ల్యాండర్ మరియు రోవర్లను గురించిన పూర్తి సమాచారం
  



0/Post a Comment/Comments

Previous Post Next Post