ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం కొత్త గవర్నర్‌ను నియమించింది. ఒడిషాకు చెందిన బిశ్వభూషణ్ హరిచందన్‌ను గవర్నర్‌గా నియమిస్తూ ఇవాళ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను, ఇక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం చేశారు. ఆయనను కూడా మార్చనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
1937లో జన్మించిన బిశ్వభూషణ్ పలుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. 1980-88లో బిజెపి ఒడిషా అద్యక్షుడిగా కూడా పనిచేశారు. 1971లో జనసంఘ్ లో చేరిన ఆయన, మధ్యలో కొంతకాలం పాటు జనతా పార్టీలో కూడా ఉన్నారు. 1996 నుండి మాత్రం బిజెపిలోనే కొనసాగుతున్నారు. పలు పుస్తకాలు రాసిన ఆయనకు న్యాయవాదిగా కూడా అనుభవం ఉంది.
ఇటీవలే విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌజ్‌ను రాజ్‌భవన్‌గా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మార్పులు చేసింది. దీని ఆధారంగా, కొత్త గవర్నర్ నియామకంపై రాష్ట్రప్రభుత్వానికి ముందే సమాచారం ఉందని భావిస్తున్నారు. యుపిఎ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమింపబడిన నరసింహన్ గారు, ఎన్డిఎ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొనసాగారు.
గవర్నర్ లకు 75 సం ల వయస్సు నిబంధన వర్తించదా ? గవర్నర్ పని కేవలం ఆలయాల్లో పొర్లు దండాలు పెట్టడమే అయితే ఈయన అది కూడా చేయలేరు కదా ?
ReplyDeleteగవర్నర్ విధిగా చేయవలసినది అని చెప్పబడే అలిఖిత నియమం కేంద్రం కోరినట్లుగా నివేదికలు తయారు చేసి పంపటం. ఐనా, కేంద్రం కోరినట్లుగా నివేదికలు తయారు చేసి గవర్నరు చేతికి అందించేందుకు తగినంత మంత్రాంగ యంత్రాంగాలు నిత్యం అందుబాటులోనే ఉంటాయు కాబట్టి గవర్నరు మహాశయులకు ఒకసారి పరిశీలించి సంతకం పెట్టటం మినహా పెద్ద్దగా శ్రమపడవలసిది ఏమీ ఉండదు. ఆపైన పెద్దగా పనేమీ ఉండదు కాబట్టి ఇష్టమైన వాళ్ళు దేవాలయాల చుట్టూ తిరిగితే తిరుగవచ్చును.
Deleteపొర్లు దండాలు పెట్టడం ఆయనిష్టం కానీ అసలు బాధ్యతలు వేరే ఉన్నాయిగా, నీహారిక గారూ 🙂.
ReplyDeleteGovernor (India) - wiki
పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా 80 దాటిన ఎన్.డి.తివారి గారు చేశారు కదా. వయసు మీద గరిష్ఠ పరిమితి విధిస్తే రాజకీయ పునరావాసం ఎలా వీలవుతుంది? On the other hand వృద్ధుల, అనుభవజ్ఞుల సేవలు ఉపయోగించుకోవడానికి వయసు పరిమితి అడ్డం వస్తుంది కదా .... అన్నది ఒక వాదన.
75 యేళ్ళ పరిమితిని .... అనధికారంగానో, స్వచ్ఛందంగానో .... వర్తింపజేయాలని మోది గారి ఆలోచన అని ఒకప్పుడు అన్నారు.
>>>పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా 80 దాటిన ఎన్.డి.తివారి గారు చేశారు కదా.>>>
Delete"గతం నుండి స్ఫూర్తి పొందాలి, గతంలో జరిగిన పొరపాట్ల నుండి పాఠం నేర్చుకుని అవి పునరావృతం కాకుండా చూసుకుంటూ ముందుకు సాగాలి. అలా కాకుండా పూర్తిగా గతంలోనే బతకడం మాత్రం సరి కాదు.
ReplyDeletetouché నీహారిక గారూ 👌 🙂.
గతంలో కూడా ఇలా జరిగిందని చెప్పడానికి తివారి ఉదాహరణ ఇచ్చానన్నమాట.
అయినా అయ్యవారు young blood ప్రోత్సహిస్తారేమో అనుకుంటే ఇలా అవుతోందేమిటో?
కానీ ఏ మాటకామాట చెప్పుకోవాలి ... గవర్నర్, ప్రెసిడెంట్ లాంటి కొన్ని పదవులకు కాస్త పరిణితి ఉన్న వ్యక్తులను నియమించవలసిన అవసరం అయితే ఉంది. లేకపోతే 1983-84 నాటి ఆం.ప్ర. గవర్నర్ ఠాకూరు రామ్ లాల్ లాగా ఉండే ప్రమాదం ఉంటుంది.
కాస్త పరిణితి ఉన్న వ్యక్తులను నియమించవలసిన అవసరం అయితే ఉంది. లేకపోతే 1983-84 నాటి ఆం.ప్ర. గవర్నర్ ఠాకూరు రామ్ లాల్ లాగా ఉండే ప్రమాదం ఉంటుంది.
Deleteగతలో రామ్‍లాల్ గారు స్వంతంగా అతితెలివిని ఉపయోగించిన కారణంగానే దెబ్బతిని నామరూపాల్లేకుండా మయమైపోయాడని నమ్ముతున్నారా? గవర్నర్ ఉద్యోగం చేసే వాళ్ళకు స్వంతతెలివిని వాడేందుకు అనుమతి ఎలా ఉంటుందండీ? కేంద్రంలోని పెద్దలే ఆదేశించినపని చేసాడు కాని తీరా అది బెడిసికొట్టే సరికి ఆపెద్దలే రామ్‍లాల్ గారిని బలిపశువును చేసి తాము దొరికిపోకుండా తప్పించుకున్నారంతే. ఐనా ఇదంతా పబ్లిక్ సీక్రెట్ అన్న సంగతి తెలిసీ మీరు రామ్‍లాల్ అపరిణతి కారణంగా వచ్చిన ప్రమాదం అనుకోవటం విడ్డూరంగా ఉంది
సీనియర్ మోస్ట్ నాయకుడు, రాజకీయ కురువృద్ధుడు, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు గారు గవర్నర్ పదవి చేబట్టాలని ఆశిద్దాం.
ReplyDeleteఓహో. ఓహోహో. నాదెండ్ల భాస్కర రావు గారంటే ఎంత అభిమానం. ఎన్టీఅర్ విరోధి ఐనందువల్లనే కదా ఆయనను ఈ జై మోస్తున్నదీ. ఏమి దిక్కుమాలిన రాజకీయం!
Deleteఅధికారదర్పంతో కండ కావరం ఎక్కిన డ్రామారావు అనబడే దుర్మతి ఒక్క సంతకంతో తొలగించిన ఉద్యోగులలో వేలాది మందికి పునర్జీవనం ప్రసాదించిన గౌరవనీయ నాదెండ్ల భాస్కర రావు గారు ధన్యులు. చేయని తప్పుకు శిక్ష అనుభవించిన ఉద్యోగులు, వారి కుటుంబీకులు & మిత్రులు తమకు చేయూత ఇచ్చిన ఆ మహనీయుని ఎల్లప్పుడూ తలచుకుంటారు.
Delete// "స్వంతతెలివిని వాడేందుకు అనుమతి...." // ఉండకపోవచ్చు. కానీ ఎదుటివారి చేతిలో పావు లాగా ఉపయోగపడకుండా పదవి నుండి తప్పుకునే వీలు అయితే ఉంటుంది.
ReplyDeleteESL ని కూడా మార్చే సూచనలు ఉన్నాయిటగా జై గారూ? అయితే ఆయన స్థానంలో నాదెండ్లను తెలంగాణా గవర్నర్ గా నియమిస్తారని ఆశిద్దాం 😀 .
ReplyDeleteనాదెండ్ల ఉండేది తెలంగాణలోనే కనుక ఆయనకు వేరే రాష్ట్రం కేటాయిస్తారనుకుంటా.
Deleteనర"హింసన్" డిప్లమాటిక్ పోస్టింగ్ కోసం ప్రయత్నిస్తున్నారని వినికిడి?
డిప్లమాటిక్ పోస్టింగా? సింగపూర్ గానీ, శ్రీలంక గానీ అయితే బోలెడు గుళ్ళు. పైగా తమిళ భాష కూడా నడుస్తుంది.
ReplyDeleteతిరుమల లోనే break దర్శనాలకు brake పడబోతోంది. సింగపూరు అసలే
Deletefine city కదండీ.
అంతా దోవల్ మహిమ గురువు గారూ.
Post a Comment