పవన్ కళ్యాణ్ గారిపై బిజెపి ఆసక్తికి కారణాలేమిటి?


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడేందుకు బిజెపి అన్నిరకాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే కొంతమంది టిడిపి నేతలను తమ పార్టీలో చేర్చుకోవడమే గాక, మరింతమందిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాక, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై కూడా ఆసక్తిని కనబరుస్తుంది. జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌తో బీజేపీ జాతీయ కార్యదర్శి రామ్‌మాధవ్ అమెరికాలో భేటీ కావడంతో ఆయన జనసేనను బిజెపిలో విలీనం చేస్తారనే వదంతులు ఊపందుకున్నాయి. పవన్‌పై బిజెపి ఇంతగా ఆసక్తి కనబరచడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. 
  • రాష్ట్రంలో పార్టీలో జనాదరణ ఉన్న నేత ఎవరూ లేకపోవడంతో బిజెపి, పవన్ కళ్యాణ్  కోసం చాలాకాలంగానే  తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. గత ఎన్నికలకు ముందే అమిత్ షా, పవన్‌ను పార్టీలోకి ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పుడు రామ్‌మాధవ్ తో భేటీ సందర్భంగా ఈ ఊహాగానాలు వచ్చాయి. 
  • సామాజిక సమీకరణలలో భాగంగా రాష్ట్రంలో బిజెపి కాపు సామాజిక వర్గాన్ని చేరదీయాలని ఆలోచిస్తుంది. ఇందులో భాగంగానే కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్ష్యుడిగా నియమించింది. ఇప్పుడు పవన్ కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభించింది.  
రామ్ మాధవ్ తో భేటీ అనంతరం వచ్చిన వదంతులపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, కేవలం విభజన హామీల విషయాన్ని ప్రస్తావించడానికే ఆయనతో భేటీ అయ్యానని, బిజెపితో కలిసి పనిచేసే అవకాశం గాని,  విలీన ప్రసక్తి గాని లేదని వివరణ ఇచ్చారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post