ఉండవల్లి అన్న క్యాంటీన్ మూసివేత


తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి ఉండవల్లి నివాసానికి సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను సోమవారం నుంచి మూసివేసారు. వినియోగదారులు లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 
    
చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు ఈ క్యాంటీన్‌కి మంచి ఆదరణ ఉండేది. ముఖ్యమంత్రి నివాసానికి వినతులు ఇచ్చే ప్రజలు, కొంత మంది పోలీసు సిబ్బంది, ఇతర అధికారుల డ్రైవర్లు మరియు సిబ్బంది, ఈ క్యాంటీన్‌ను వినియోగించేవారు. ఆయన ముఖ్యమంత్రి హోదా కోల్పోవడంతో క్రమంగా ఇక్కడికి వచ్చే వారి సంఖ్య కూడా తగ్గింది. కనీస సంఖ్యలో వినియోగ దారులు కూడా రాకపోతుండడంతో దీనిని మూసివేశారు.

1/Post a Comment/Comments

  1. చంద్రబాబు గారి నివాసానికి దగ్గరగా ఉన్న భవనం కదా, మరి సక్రమ కట్టడమేనా?🤔

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post