పవన్ కళ్యాణ్ - ఇంకా అదే రాజకీయ, సైద్ధాంతిక అయోమయం, ద్వైదీభావం


జనసేన పార్టీని స్థాపించి ఐదు ఏళ్ళు దాటినా విధానాల పట్ల, రాజకీయ లక్ష్యాల పట్ల ఇంకా స్పష్టత లేదు. స్థాపకుడు మరియు అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు సైద్ధాంతిక అయోమయంలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన తానా సభ సందర్భంగా చేసిన ప్రసంగంలో ఈ రకమైన ద్వైదీభావం కొట్టొచ్చినట్లు కనిపించింది.     
  • పవన్ ప్రసంగంలో ప్రతిసారి మహానాయకుల పేర్లు చెప్పి ఆదర్శాలు వల్లించడం కనిపిస్తుంది. కాని ఆ మహానాయకుల పేర్లు మారుతూనే ఉంటాయి. ఈసారి ఆయన గాంధీ,  థామస్ అల్వా ఎడిసన్‌, నెల్సన్ మండేలా, వివేకానందుల పేర్లు ప్రస్తావించారు.    
  • విద్యా విధానం తన ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా లేదని చదువంటే ఇష్టం పోయి కొనసాగించలేకపోయారట, కాని, ఖుషీ తరువాత సినిమాల మీద ఆసక్తి లేకపోయినా కొనసాగించారట. ఆయనకు చదువు మీద లేని జాలి, సినిమాల మీద ఎందుకో? 
  • ఓటమి తనను బాధించలేదని చెబుతూనే, పలుమార్లు గెలుపోటముల గురించి ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లి వచ్చాడని ఎద్దేవా చేశారు.    
  • తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆయన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఆయన చిన్నతనంలో స్నేహితుడు తెలంగాణ వెళితే అవమానించారంటూ ఇప్పుడు ఆరోపణలు చేశారు. కాని ఆయన మాత్రం తెలంగాణ వెళ్లి అక్కడే సెటిలయ్యారు.     
  • కులాలపై, తెలంగాణపై ప్రస్తావన వస్తే పవన్ గారికి దేశ సమగ్రత, ఐకమత్యం గుర్తుకువస్తుంది. అదే బిజెపి ప్రస్తావన వచ్చినప్పుడు మాత్రం దక్షిణాదికి అన్యాయం వంటి ఆరోపణలు గుర్తుకు వస్తాయి. 
  • ఇప్పటివరకు పార్టీ సిద్ధాంతాల పట్ల, రాజకీయ విధానాల పట్ల స్పష్టతను ఇవ్వలేకపోయారు గాని సిద్ధాంతాల కోసం పాటుపడతారట మరియు ఎన్ని బాధలైనా పడతారట.        
  • ప్రసంగంలో భాగంగా తాను ఎవరికీ గులాంగిరి చేయనని అన్నారు. చేయమని ఎవరైనా బలవంత పెట్టారా? లేక ఇంతకు ముందు పెట్టుకున్న పొత్తులు గులాంగిరీలా అనిపించాయా? లాంటి విషయాలపై స్పష్టత ఇవ్వలేదు.

0/Post a Comment/Comments