విజయసాయిరెడ్డి నియామకంపై అంత పట్టుదల దేనికి?


విజయసాయిరెడ్డి గారిని ఎలాంటి జీతభత్యాలు లేకుండా, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ఆదివారం రోజు జీవో జారీ చేశారు. ఇలా నియమించడానికి అనుగుణంగా ఆఫీస్‌ ఆఫ్‌ ప్రాఫిట్‌ నిబంధనల్లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం రోజు ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ప్రతినిధిగా నియమించడానికి, ప్రభుత్వానికి రాష్ట్రంలో, వైసిపి పార్టీలో ఆయన తప్ప సమర్థులు ఎవరూ కనిపించలేదా?, ఈ పదవిని నిబంధనలు మార్చి మరీ ఆయనకే కట్టబెట్టాలన్నంత పట్టుదలదేనికో అర్థం చేసుకోవడం కష్టమే.     

వ్యవస్థల పైన కనీస అవగాహన లేకుండా, పర్యవసనాలు ఎలా ఉంటాయో ఏ మాత్రం ఆలోచించకుండా జీవో జారీ చేసి, దానిని నిబంధనలకు విరుద్ధమని రద్ధు చేసినందుకు ఇప్పటికే ఒకసారి ముఖ్యమంత్రి కార్యాలయం అభాసుపాలయింది. మళ్ళీ దానిని సమర్థించుకునేందుకా అన్నట్లు నిబంధనలు మార్చారు. కేబినెట్ హోదా ఉన్న పదవులు తక్కువగా ఉన్నాయి. పార్టీ నుండి ఔత్సాహికులు ఎక్కువగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులలో ఒక పదవిని కేబినెట్ హోదా నుండి తప్పించడం ఎందుకో? 

విజయసాయిరెడ్డి నియామకం రద్దు (4th July 2019 నాటి వార్త)

ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నియమింపబడిన విజయసాయిరెడ్డి గారిని తొలగించారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం గురువారం నాడు జీవో 74ను జారీ చేసింది. గత నెల 22వ తేదీన జారీ చేసిన జీవో 68 ద్వారా ఆయనను ఈ పదవిలో నియమించారు. రాజ్యసభ సభ్యుడైన ఆయన, వేతనం మరియు క్యాబినెట్ హోదా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి పదవిని పొందడం 'ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్' కింద నిబంధనలకు విరుద్ధమని తేలడంతోనే, ఈ ఉపసంహరణ జీవోను జారీచేసినట్లు తెలుస్తుంది. 

విజయసాయి రెడ్డి గారిని ఈ పదవికి ఎంపిక చేసినప్పుడే, విలేఖరులు ఆయనను ఈ నియామకం నిబంధనలకు విరుద్ధం కాదా? అని ప్రశ్నించారు. అప్పుడు ఆయన తాను, ఈ పదవికి వేతనం తీసుకోనని చెప్పి దాటవేసారు. ఎంతో మంది అనుభవజ్ఞులను సలహాదారులుగా నియమించుకున్న ప్రభుత్వం, విలేఖరులు వెంటనే ప్రశ్నించగలిగిన 'ఈ నిబంధనల ఉల్లంఘన'ను గమనించకపోవడం ఆశ్చర్యకరమే.

గత ప్రభుత్వ హయాంలో కంభంపాటి రామ్మోహన్‌రావు గారు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా ఉండేవారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నేతలను ఈ పదవికి ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడు ఆ పదవిలో ఎవరిని నియమిస్తారో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 

4/Post a Comment/Comments

 1. ఈ పదవికి రోజాగారు సరిపోతారు కదా.

  ReplyDelete
  Replies
  1. "ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్' కింద నిబంధనలకు విరుద్ధమని"

   ఆవిడ శాసనసభ్యులు కనుక ఇవే నిబంధనలు వర్తిస్తాయి.

   Delete
 2. మోదీ కాళ్ళుపట్టుకొని ఇప్పటికే శ్రీమాన్ విజయ సాయి రెడ్డి గారు ఆయన అనుగ్రహం సంపాదించి పెట్టారు వైకాపాకు. రాష్ట్రానికి అందువల్ల లాభం ఏమీ లేకపోయినా అది సదరు పార్టీకి ఉపయోగపడే అంశం కాబట్టే అంత పట్టుదల అనుకోవాలి.

  ReplyDelete
 3. అవసరం కోసం, అధికారం నిలబెట్టుకోవడం కోసం అడ్డ దారులు తొక్కడం, కాళ్ళు పట్టుకోవడం అన్ని పార్టీలకు పుట్టుకతో వచ్చే బుద్దే. టీడీపీ వాళ్ళు ఆ నాలుగేళ్లు చేసిన పని కూడా అదేనని మీరు గుర్తు పెట్టుకోవాలి. సో, రెండు పార్టీలకు ఏదైనా తేడా ఉంది అంటే అది పేరులోనే.

  ReplyDelete

Post a Comment

Previous Post Next Post