చంద్రయాన్-2ను ప్రత్యక్ష్యంగా చూడాలనుకుంటున్నారా?


చంద్రయాన్-2 ప్రయోగం దగ్గరపడుతున్న సమయంలో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రజలకు దీనిని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. దాదాపు 5 వేల మందికి, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుండి ఇలా వీక్షించే అదృష్టం దక్కనుంది. 

ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?

ప్రజలు ఈ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడడానికి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం వెబ్‌సైట్‌లోని కింది లింకులో తమ వివరాలు నమోదు చేసుకోవాలి.   


మొదట రిజిస్టర్ చేసుకున్న వారికే ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికే 2 వేల మంది అక్కడ నమోదు చేసుకున్నారు. ప్రయోగ స్థలం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రజల కోసం గ్యాలరీ ఉంటుంది. అక్కడికి వెళ్ళినవారు, చంద్రయాన్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడగలగడమే కాకుండా, రాకెట్ గార్డెన్ మరియు స్పేస్ మ్యూజియంలను కూడా చూడవచ్చు.  

తమ ప్రయోగాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగానే ఇస్రో ఈ అవకాశం కల్పించింది. గ్యాలరీ వద్ద పెద్ద తెరలను కూడా ఏర్పాటు చేశారు. 

చంద్రయాన్ 2 ప్రయోగం జూలై 15వ తేదీన, భారత కాలమానం ప్రకారం ఉదయం 2.51 గంటలకు మొదలవనుంది. అన్నీ ప్రణాళిక ప్రకారం సవ్యంగా జరిగితే, సెప్టెంబర్ 6న ల్యాండర్  చంద్రునిపై కాలుమోపనుంది.  

0/Post a Comment/Comments

Previous Post Next Post