తగ్గించడానికి ఇంకేం చర్యలు తీసుకోవాలో?


హైదరాబాద్ నగరంలో డ్రంకెన్ డ్రైవ్ కేసులలో పట్టుబడుతున్న వారి సంఖ్య రాను, రాను పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భారీ జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ రద్ధు మరియు జైలు శిక్ష కూడా విధిస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు. 

హైదరాబాద్‌లో ఈ సంవత్సరం తొలి ఆరు నెలలలో మొత్తం 15,133 మంది డ్రంకెన్ డ్రైవ్ కేసులలో పట్టుబడ్డారు. వీరికి దాదాపు మూడు కోట్ల రూపాయల జరిమానాతో పాటు, 2,864 మందికి జైలుశిక్ష కూడా విధించారు. 929 డ్రైవింగ్ లైసెన్సులు కూడా రద్ధుచేయబడ్డాయి.       

2019 సంవత్సరం గణాంకాలను పరిశీలిస్తే మొదటి నాలుగు నెలలతో పోల్చితే మే మరియు జూన్ నెలల్లో నమోదయిన కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఏప్రిల్‌లో  2,215 మంది పట్టుబడగా, జూన్‌లో ఈ సంఖ్య 2,770 కు పెరిగింది. పట్టుబడిన వారిలో ఒక ట్రావెల్ బస్ డ్రైవర్ కూడా ఉండడం గమనార్హం. గణాంకాలలో పొందుపరుచనప్పటికీ, వీరిలో మహిళల శాతం కూడా బాగా పెరిగిందట.

0/Post a Comment/Comments

Previous Post Next Post