ఈ అదృష్టం(?) ఆంధ్రప్రదేశ్ ప్రజలకే సొంతం


దేశంలో ఏ రాష్ట్రంలోనయినా పథకాలకు దివంగత నాయకుల పేర్లు పెడతారు. ఆ ఘనత, గౌరవం తమకే దక్కాలనుకుంటే ముఖ్యమంత్రి యోజన, ముఖ్యమంత్రి పథకం అంటూ పరోక్షంగా తమ హోదాతో ప్రచారం పొందుతారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇంతకు  ముందు ముఖ్యమంత్రులు, తమ పేరు ప్రత్యక్షంగా కాకున్నా అన్న, అమ్మ లాంటి పేర్లతో పథకాలు ప్రారంభించారు. కాని, ముఖ్యమంత్రులు  తమ సొంత పేరుతో పథకాలు ప్రారంభించడం, మాకు తెలిసినంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తున్నాం. 

బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో పథకాలు ప్రారంభించారు. పైగా దీనిని, జగన్ తన పేరు పెట్టడానికి ఒప్పుకోలేదని, అయినా తామంతా బలవంతం చేసి ఒప్పించామని శాసనసభలో సమర్థించుకున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పేరుతో చంద్రన్న పథకాలను ప్రకటించినప్పుడు, ఇదే వైసిపి అప్పట్లో బతికున్న వారి పేరుతో పథకాలేంటి?, తన సొంతడబ్బులు ఏమైనా ఇస్తున్నారా? అంటూ  తీవ్ర విమర్శలు చేసింది. అధికారంలోకి వచ్చీ రాగానే తాము కూడా అదే బాటలో నడవడం ఏమిటో? అయినా ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకతే కదా! 

1/Post a Comment/Comments

  1. ఇదే వైసిపి అప్పట్లో బతికున్న వారి పేరుతో పథకాలేంటి?, తన సొంతడబ్బులు ఏమైనా ఇస్తున్నారా? అంటూ తీవ్ర విమర్శలు చేసింది. అధికారంలోకి వచ్చీ రాగానే తాము కూడా అదే బాటలో నడవడం ఏమిటో?

    ఎదుటివాడికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి. డోన్ట్ కేర్!

    ReplyDelete

Post a comment