ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులు


బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 2019-20 సంవత్సరానికి గాను, ఆర్ధిక మంత్రిగా తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. దీనిలోని  ముఖ్యాంశాలు:

మొత్తం బడ్జెట్: 2,27,974 కోట్లు. (19.32 శాతం పెరుగుదల)  
ఇందులో రెవెన్యూ వ్యయం: 1,80,475 కోట్లు 
రెవెన్యూ లోటు: 1,778,52 కోట్లు
 • వైయస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతుకు 12500 రూపాయలు అందించనున్నారు. ఈ పథకం 2020 మే నుంచి ప్రారంభించాలని  ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 8,750 కోట్లు కేటాయించారు.
 • వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు రూ 20,677 కోట్లు, వైయస్ఆర్ పంట బీమాకు1,163 కోట్లు. 
 • 32618 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత. 
 • వైద్య, ఆరోగ్య సంరక్షణ రంగానికి 11399 కోట్లు. 
 • గృహనిర్మాణ రంగానికి 3617 కోట్లు. 
 • ధరల స్థిరీకరణ నిధికి 3,000 కోట్లు
 • వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకం కింద ఉచిత బోర్‌వెల్స్‌కు 200 కోట్లు
 • ఆక్వా రైతుల విద్యుత్ రాయితీకి 475 కోట్లు 
 • రైతులకు విత్తనాల పంపిణీకి 200 కోట్లు 
 • పాఠశాలలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 500 కోట్లు, పాఠశాల నిర్వహణకు 160 కోట్ల మంజూరు. 
 • ప్రకృతి విపత్తు నిర్వహణకు 2,000 కోట్లు
 • ప్రణాళికా విభాగానికి 1439 కోట్లు
 • సంక్షేమ రంగానికి 14,412 కోట్లు 
 • అమ్మ వోడి పథకానికి 6455 కోట్లు 
 • ఆశా కార్మికులకు 455.85 కోట్లు
 • పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకానికి 1077 కోట్లు,
 • డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలకు 1140 కోట్లు 
 • ఎపిఎస్‌ఆర్‌టిసికి 1000 కోట్లు 
 • గిరిజనుల అభివృద్ధికి 4988 కోట్లు  
 • దళితుల అభివృద్ధికి 15 వేల కోట్లు 
 • బిసిల అభివృద్ధికి 1561 కోట్లు 
 • వైయస్ఆర్ హౌసింగ్ స్కీమ్‌కు 1500 కోట్లు 
 • పట్టణ స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలకు 648 కోట్లు 
 • మత్స్యకారుల సంక్షేమం కోసం 410 కోట్లు 
 • వైయస్ఆర్ ఆరోగ్యశ్రీకి 1740 కోట్లు 
 • కాపు సంక్షేమానికి 2000 కోట్లు 
 • అగ్రి గోల్డ్ బాధితులకు 1150 కోట్లు 
 • జగనన్న విద్యా దీవెన పథకానికి 4,962.3 కోట్లు
 • సిఎం కాల్ సెంటర్‌కు 73 కోట్లు 
 • క్యాపిటల్ రీజియన్ సోషల్ సెక్యూరిటీ ఫండ్‌కు 65 కోట్లు 
 • అటవీ, విజ్ఞాన మరియు సాంకేతిక రంగాలకు 477 కోట్లు 
 • పులివెందుల ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీకి 100 కోట్లు 
 • బ్రాహ్మణ కార్పొరేషన్‌కు 100 కోట్లు 
 • రాజధాని అభివృద్ధికి 500 కోట్లు 
 • ఆటోలు కలిగి ఉన్న డ్రైవర్లకు 400 కోట్ల ఆర్థిక సహాయం 
 • అడ్వకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్‌కు 100 కోట్లు 
 • సమాచారం మరియు ప్రజా సంబంధాల శాఖ (ఐ అండ్ పిఆర్) కోసం 191 కోట్లు  
 • మత సంస్థలకు 234 కోట్లు 
 • గ్రామ కార్యదర్శులకు 700 కోట్లు, గ్రామ వాలంటీర్లకు 720 కోట్లు 
 • మున్సిపల్ వార్డ్ కార్యదర్శులకు 180 కోట్లు, మునిసిపల్ వార్డ్ వాలంటీర్లకు 180 కోట్లు 
 • పౌర సరఫరాల శాఖకు 3,750 కోట్లు 
 • కడప స్టీల్ ప్లాంట్‌కు 250 కోట్లు 
 • స్మార్ట్ సిటీలకు 150 కోట్లు 
 • వైయస్ఆర్ పెన్షన్ కానుకకు 15,746.58 కోట్లు

0/Post a Comment/Comments

Previous Post Next Post