మౌఢ్యమి


గ్రహ మౌఢ్యమి (వాడుక భాషలో మూఢం) అంటే, ఆ గ్రహం భూమిపై నుండి కనిపించకపోవడం లేక అస్తంగత్వం చెందడం. ఇది రెండు సందర్భాలలో జరుగుతుంది.
  • భూమిపై  మనకు సూర్య చంద్రులు ఉదయించి, అస్తమించినట్లుగానే గ్రహాలు కూడా అస్తమిస్తాయి. ఇలా గ్రహం అస్తమించడాన్ని ప్రాక్ అస్తంగత్వం అని,  
  • సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు సూర్యకాంతి ముందు ఆ గ్రహం కనిపించదు. ఇలాంటి పరిస్థితిని పశ్చాద అస్తంగత్వం అని అంటారు. 
అంటే గ్రహ మూఢ కాలంలో, ఆ గ్రహ కిరణాలు భూమిపైకి ప్రసరించవు. లేక ఆ గ్రహ దృష్టి బలహీనమైపోతుంది. అన్ని గ్రహాలకు ఇలా జరుగుతుంది. కాని, జాతక శాస్త్ర రీత్యా గురు, శుక్ర గ్రహాలకు ప్రాధాన్యత ఎక్కువ కాబట్టి, గురు, శుక్ర మూఢాలను మాత్రమే పాటిస్తారు. 

ఈ సంవత్సరం నిన్న సోమవారం రోజు శుక్రమూఢమి ప్రారంభమయింది. ఇది సెప్టెంబరు 20 వరకు కొనసాగనుంది. ప్రాంతాన్ని బట్టి ఈ మూఢం ఒక రోజు అటూ ఇటూగా ఉండవచ్చు. గురు మౌఢ్యమి డిసెంబరు 13న ప్రారంభమై, 2020 జనవరి 10వరకు కొనసాగనుంది.     

శుక్రమౌఢ్యమి కాలములో
  • ప్రకృతి సంపద క్షీణిస్తుంది, సముద్రం ఆటు, పోటులలో మార్పులు వస్తాయి. 
  • స్త్రీల మీద అత్యాచారాలు అధికమవుతాయి. 
  • విడాకుల సంఖ్య పెరుగుతుంది.   
గురు మౌఢ్యమి కాలములో
  • పాలకుల అవినీతి పెరుగుతుంది. 
  • గురువులకు, ముసలివారికి ప్రమాదకర సమయం. 
  • సమాజంలో భ్రష్టత్వం, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతాయి.     
మౌఢ్యమిలో చేయకూడని కార్యక్రమాలు 
  • పెళ్ళిచూపులు, వివాహం, ఉపనయనం, పుట్టువెంట్రుకలు, చెవులు కుట్టించుట,
  • గృహారంభం, గృహప్రవేశం
  • యజ్ఞ, యాగాదులు   
  • మంత్రానుష్టానం
  • విగ్రహ ప్రతిష్టలు
  • వ్రతాలు
  • నూతనవధువు ప్రవేశం 
  • నూతన వాహనము కొనుట
  • కొత్త నీటివనరుల కోసం ప్రయత్నం, నూతన వ్యాపార ఆరంభాలు  
  • వేద విద్యారంభం మొదలగునవి చేయరాదు. 
మౌఢ్యమిలో క్రింది కార్యక్రమాలు చేపట్టవచ్చు  
  • జాతకర్మ, జాతకం రాయించుకోవడం 
  • నవగ్రహ శాంతులు, జప, హోమాది శాంతులు, గండనక్షత్ర శాంతులు 
  • సీమంతం, నామకరణం, అన్నప్రాసనాది కార్యక్రమాలు

0/Post a Comment/Comments

Previous Post Next Post