చాలా కాలంగా క్రికెట్‌ను అనుసరించేవారికి ఈ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ విషయంలో "Déjà vu" అనుభూతి కలుగుతోంది.
- 1983లో మనదేశం తొలిసారి సెమీఫైనల్‌కు చేరినప్పుడు మాంచెస్టర్‌లోని ఇదే ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో తొలి సెమీఫైనల్ ఆడింది. కాకపొతే అప్పుడు ప్రత్యర్థి ఇంగ్లండ్. జూన్ 22న జరిగిన ఆ మ్యాచ్‌లో ఇండియా ఆరు వికెట్లతో విజయం సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టింది.
- 2008 అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో మనదేశం, న్యూజీలాండ్‌తో తలపడింది. అప్పుడు అండర్-19 టీమ్ కేప్టెన్లుగా ఉన్న కోహ్లి, విలియమ్సన్లు ఇప్పుడు 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో కూడా కెప్టెన్లుగా తలపడుతుండడం విశేషం. కాగా అప్పటి జట్లలో ఉన్న ప్లేయర్లలో బౌల్ట్, సౌతీ మరియు జడేజాలు ఇప్పుడు కూడా ఆడుతున్నారు. ఆ మ్యాచ్‌లో కూడా మూడు వికెట్లతో విజయం సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టింది.
Post a Comment