విజేతను నిర్ణయించే పద్ధతి ఇదేనా?


ప్రపంచ కప్ ముగిసిన తరువాత  విజేతను నిర్ణయించిన విధానంపై దుమారం రేగుతోంది. బౌండరీల సంఖ్య ఆధారంగా విజేతను ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బౌండరీలు సాధించడం కన్నా, వికెట్లు తీయడం కష్టమైన పని అని, వికెట్ల ఆధారంగా విజేతను ప్రకటించి ఉంటే న్యూజీలాండ్ విజేతగా నిలిచేదని కూడా వాదనలు మొదలయ్యాయి. 

వర్షం పడితే ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు, కాని మ్యాచ్‌లో సమాన పరుగులు, సూపర్ ఓవర్లో సమాన పరుగులు చేస్తే సంయుక్త విజేతలుగా పరిగణించరా? ఇంగ్లాండ్-న్యూజిలాండ్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటించి ఉంటే హుందాగా ఉండేదని కూడా వ్యాఖ్యానాలు వస్తున్నాయి. 

క్రికెట్‌ను పూర్తిగా బ్యాట్స్‌మెన్ గేమ్‌గా మార్చేస్తున్నారని, కేవలం బౌండరీల ఆధారంగా విజేతను నిర్ణయించడం సరికాదని, చాలామంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్రెట్ లీ, గౌతమ్ గంభీర్లు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

మ్యాచ్ అనంతరం బెన్ స్టోక్స్‌ మాట్లాడుతూ, న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు తాను జీవితాంతం క్షమాపణలు చెప్తూనే ఉంటాను అన్నాడు. ఇది తాను కావాలని చేసింది కాదని, త్రో అనుకోకుండా తన బ్యాట్‌ను తాకి ఆరు పరుగులు లభించాయన్నాడు. అయితే అదే తమ గెలుపులో కీలకంగా మారిందన్నాడు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post