చంద్రయాన్-2 వాయిదా, ఎందుకు?


దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్ - 2 ప్రయోగం అనూహ్యంగా వాయిదా పడింది. సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రయోగం వాయిదా పడినట్లు ఇస్రో తెలియజేసింది. ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ ఎత్తున తరలివచ్చిన సాధారణ ప్రజలకు, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ గారికి, మరియు ఇతర ప్రముఖులకు నిరాశ ఎదురయింది.

తెల్లవారుజామున 2.51 గంటలకు ప్రయోగ సమయాన్ని నిర్ణయించగా, దానికి 56 నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే చంద్రయాన్‌-2 ప్రయోగ ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా ఆపివేశారు. ఈ ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు చేపట్టేది తర్వాత ప్రకటిస్తామని ఇస్రో అధికారులు తెలిపారు.

సాంకేతిక కారణాలు అని ఇస్రో ప్రకటించినప్పటికీ, నిర్దిష్ట కారణాన్ని మాత్రం తెలియజేయలేదు. కాగా, ఫ్యూయల్ కండక్టర్‌లో లీకేజీ కారణమని అనధికార వార్తలు వచ్చాయి. తిరిగి ప్రయోగం 3 నుండి 28 రోజులలో ఉండవచ్చునని కూడా వినిపించింది.

2/Post a Comment/Comments

 1. సాంకేతిక కారణాలు అని ఇస్రో ప్రకటించినా, ఫ్యూయల్ కండక్టర్‌లో లీకేజీ కారణమని అనధికార వార్తలు వచ్చాయి.
  వాక్యనిర్మాణం సరిగ్గాలేదు. ఫ్యూయల్ కండక్టర్‌లో లీకేజీ కూడా ఒక సాంకేతిక కారణమే. మీరు మరొకలా అర్థం వచ్చేలా వ్రాసారు. సాంకేతిక కారణాలన్నారు కాని అది కాదు లీకేజీ అట అన్నట్లుంది మీ వాక్యం.

  ReplyDelete
  Replies
  1. Thank You, Anonymous గారు, సరిదిద్దుకున్నాము.

   Delete

Post a comment