బడ్జెట్ ముఖ్యాంశాలు మరియు మనం తెలుసుకోవలసిన విషయాలు


గావ్, గరీబ్ మరియు కిసాన్ అనేది తమ నినాదంగా పేర్కొంటూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోని ముఖ్యాంశాలు...  
  • పాన్ మరియు ఆధార్ సంఖ్యలను ఒకదాని స్థానంలో మరొకటి ఉపయోగించుకోవచ్చు. అంటే ఆధార్ సంఖ్యను IT రిటర్నులను దాఖలు చేయడానికి ఉపయోగించవచ్చు.   
  • పన్ను చెల్లింపుదారులకు 5 లక్షల కనీస పరిమితిని ప్రకటించారు. అధికాదాయ వర్గాలపై భారీగా సర్ ఛార్జిని విధించారు.  ఏడాదికి 2 నుండి 5 కోట్లు ఆదాయం ఉన్నవారిపై 3%, మరియు 5 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ ఉన్నవారిపై  7% సర్ ఛార్జిగా నిర్ణయించారు. 
  • ఎలక్ట్రిక్ వాహనాలపై జిఎస్‌టి రేటును 5 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు తీసుకున్న రుణాలపై వడ్డీపై  1.5 లక్షల అదనపు ఆదాయపు పన్ను మినహాయింపును ఇవ్వనున్నారు. 
  • మధ్యతరగతి వారు ఇళ్ళు కొనడానికి మార్చి 31, 2020 వరకు రుణాలపై ₹ 1.5 లక్షల అదనపు సబ్సిడిని ప్రతిపాదించారు. గృహ కొనుగోలుదారులకు 7 లక్షల ప్రయోజనం చేకూరనుంది.  
  • భారత పాస్‌పోర్ట్‌లు కలిగి ఉన్న ఎన్నారైలకు ఆధార్ కార్డులు అందించనున్నారు. 
  • కొత్త 20 రూపాయల నాణెం విడుదల కోసం ప్రతిపాదనలు. 
  • ఇంధనంపై లీటరుకు ఒక రూపాయి చొప్పున ఎక్సైజ్ సుంకం పెంపు. 
  • స్టార్ట్-అప్ సంస్థల విలువ మదింపుపై ఐటి నిబంధనల సడలింపు. స్టార్టప్‌లలో పెట్టుబడులకు ఉపయోగించే, మూలధన లాభాలకు పన్ను మినహాయింపు కాలం మార్చి 31, 2021 వరకు పెంపు.  స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి మరియు నిధుల కోసం ఇన్వెస్టర్లను సమకూర్చడములో సహాయపడటానికి టీవీ ఛానెల్ కూడా ప్రారంభించబడుతుంది.
  • సంవత్సరానికి నగదు విత్ డ్రా కోటి రూపాయలను మించితే 2% టాక్స్.   
  • ప్రభుత్వ రంగ బ్యాంకులకు 70,000 కోట్ల మూలధనం ఇవ్వనున్నారు. 
  • ఈ సంవత్సరం ప్రభుత్వ రంగ సంస్థల నుండి 1.05 లక్షల కోట్ల మూలధన ఉపసంహరణ. 
  • కొత్త జాతీయ విద్యా విధానం మరియు విదేశీ విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నాలు. 
  • రైల్వే మౌలిక సదుపాయాల కోసం 50 లక్షల కోట్లు అవసరమవనున్నాయి. ఈ రంగంలో  ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించే యోచన
  • 2022 నాటికి, దేశంలోని ప్రతి కుటుంబానికి, విద్యుత్ మరియు వంట గ్యాస్ కనెక్షన్లు. 
  • జీరో- బడ్జెట్ వ్యవసాయం దిశగా ప్రయత్నాలు. 
  • రిటైల్ వ్యాపారులకు కొత్త పెన్షన్ పథకం  
  • MSMEలకు 1 కోటి వరకు రుణాలు.
  • ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్లలో, డెట్ సెక్యూరిటీలలో విదేశీ పెట్టుబడులు అనుమతించబడతాయి. లిస్టెడ్ కంపెనీలలో కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్‌ను 25% నుండి 35% కి పెంచవచ్చు.
  • ఈ సంవత్సరం గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ మన దేశంలో జరుగనుంది. 

2/Post a Comment/Comments

  1. Nice, But Nothing about states :(

    ReplyDelete
    Replies
    1. telugu states? or united states ?? lol :)

      Delete

Post a Comment

Previous Post Next Post