ద్రోణంరాజు శ్రీనివాస్, కమెడియన్ పృథ్విలకు కీలక పదవులు


ద్రోణంరాజు శ్రీనివాస్, కమెడియన్ పృథ్విలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా ద్రోణంరాజు శ్రీనివాస్ గారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పృథ్వి గారిని తిరుమల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌కు (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా నియమించారు. 

ద్రోణంరాజు శ్రీనివాస్ గారు ఎన్నికలకు ముందు గత మార్చిలో కాంగ్రెస్ పార్టీని వీడి వైసిపిలో చేరారు. ఆయన విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం నుండి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆయన రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ చీఫ్ విప్ గా కూడా పనిచేశారు. ఈయనను  విఎండిఆర్‌ఏ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. 
   

'థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ'గా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాస్య నటుడు పృథ్వీరాజ్‌ గారు, గత అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ   మద్దతుదారుడిగా ఉంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పృథ్వి, తన సొంత జిల్లాలో జగన్ పాదయాత్ర సందర్భంగా వైసిపిలో చేరారు. ఈయన ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న విషయం విదితమే.

1/Post a Comment/Comments

  1. పృథ్వి గారిని తిరుమల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌కు (ఎస్‌వీబీసీ) చైర్మన్‌గా నియమించారు
    అద్భుతంగా ఉంది. ఇక శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్‌ తీరుమారి శ్రీ వెంకటేశ్వర కామెడీ ఛానెల్‌ కాబోతోందన్నమాట. ఆంధ్రప్రజానీకం అదృష్టమే అదృష్టం! వెంకన్నకే కామెడీ చూపబోతున్నారు వాళు ఎన్నుకొన్న ప్రభువులు!

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post