ఇవాళ రాత్రి జిఎస్ఎల్వి-3 రాకెట్ ద్వారా చంద్రయాన్- 2 ప్రయోగం జరగనుంది. ఇందులో చంద్రుని చుట్టూ పరిభ్రమించేందుకు ఆర్బిటర్, చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో దిగే 'విక్రమ్' అనే పేరుగల ల్యాండర్, లాండర్ నుండి దిగి అక్కడ సంచరించే 'ప్రగ్యాన్' అనే రోవర్ ఉండనున్నాయి.
ప్రగ్యాన్ రోవర్ పై ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ధూళితో కూడిన చంద్రుని ఉపరితలంపై అది తిరుగాడుతున్నప్పుడు పడే ముద్రలలో మన జాతీయ చిహ్నం మరియు ఇస్రో లోగో ఉండనున్నాయి. వాటిని ఈ కింది చిత్రాలలో చూడవచ్చు.
Post a Comment