ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన భద్రతా సిబ్బందిని తగ్గించిందని, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఇంతకుముందు స్థాయిలోనే భద్రతను కల్పించాలని, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా జరగలేదని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, తాము చంద్రబాబుకున్న జెడ్ ప్లస్ కేటగిరీని తొలగించలేదని, భద్రతను కూడా కుదించలేదని వివరాలు అందజేశారు. వాస్తవంగా చంద్రబాబు భద్రతకు 58 మందినే కేటాయించాలని, కాని ఆయనకు రక్షణగా 74 మంది భద్రతా సిబ్బంది ఉన్నారని కోర్టుకు తెలిపారు.
చంద్రబాబు భద్రతా కాన్వాయ్‌లో ఉన్న ఎస్కార్ట్ మరియు పైలట్ వాహనాలను ప్రభుత్వం తొలగించింది. స్వగ్రామంలోని ఆయన ఇంటివద్ద పనిచేసే భద్రతా సిబ్బందిని కూడా తగ్గించారు. లోకేష్ గారికి తప్ప ఆయన మిగిలిన కుటుంబ సభ్యులకు ఉన్న భద్రతను కూడా పూర్తిగా తొలగించారు.
కాగా, చంద్రబాబు నాయుడు గారి భద్రత కుదించారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని డిజిపి గౌతం సవాంగ్ అన్నారు. నిబంధనల ప్రకారం ఎంత సెక్యూరిటీ ఇవ్వాలో అంతకంటే ఎక్కువగానే ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు గారు, ఇంకా తాను ముఖ్యమంత్రినే అని భ్రమపడుతున్నారని, ఆయనకు ఇప్పటికే హోదాను మించిన భద్రతను కల్పిస్తున్నామని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అసలు అదనపు భద్రత కావాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కోరలేదని, రాజకీయం చేయడానికే కోర్టును ఆశ్రయించారని ఆమె విమర్శించారు.
భద్రతపై రాజకీయాలు చేయడం ఇరు పార్టీలకు శ్రేయస్కరం కాదు. చంద్రబాబు గారు ప్రభుత్వంతో మాట్లాడి మరింత భద్రతను సమకూర్చుకుంటే బాగుండేది. ఇప్పుడు ముఖ్యమంత్రి కానప్పటికీ, ఆయనకు పదుల సంఖ్యలో భద్రతా సిబ్బంది ఉన్నారని ప్రజలలోకి వెళ్ళింది. ఒక్కరి కోసం పదులు/ వందల సంఖ్యలో భద్రతా సిబ్బంది ఉండడం, ప్రజలలో ఆయన పట్ల వ్యతిరేకతను పెంచుతుంది. ఇక ప్రభుత్వం విషయానికి వస్తే, రేపు ఆయనపై గాని, ఆయన కుటుంబ సభ్యులపైగాని ఏదైనా దాడి జరిగితే బాధ్యత వహించవలసి వస్తుంది. లేదా గత ప్రభుత్వం వలె 'కోడి కత్తి' తరహా ప్రత్యారోపణలు చేయవలసిన అగత్యం పడుతుంది.
74*50000( avg salary)=babu gari per month security budget,
ReplyDelete74 మందిని కాదు, 174 మందిని సెక్యూరిటీగా పెట్టి ఆ ఖర్చు చంద్రబాబునాయుడు గారి అకౌంట్లొ వెయ్యండి. సరిపోతుంది
ReplyDeleteభద్రత ఖర్చు చంద్రబాబు గారి అకౌంట్లో ఎందుకు వేయాలండీ? ప్రస్తుత సి.ఎమ్. గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు వారికి కల్పించిన భద్రత ఖర్చు వారి అకౌంట్లో వేసిందా అప్పటి ప్రభుత్వం?
ReplyDeleteఇక, చంద్రబాబు గారు ఇంకా తాను ముఖ్యమంత్రినే అని భ్రమ పడుతున్నారని అంటూ హోం మంత్రి అప్రస్తుత విమర్శ చెయ్యడం ఆ స్ధాయికి హుందాగా లేదు. Chandra Babu bashing మరీ ఎక్కువవుతున్నట్లుంది.
@విన్నకోట గారు, జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అతనికి, మొత్తం 14 మందితో 7+7 భద్రత, మాత్రమే ఉండేది. అతనిపై హత్యాయత్నం జరిగితే ప్రభుత్వమే ఎలా అవహేళన చేసిందో మీకు తెలుసు. కాని, సిబ్బందిని పెంచలేదు. ఇప్పుడు 74 మంది కూడా సరిపోదట, ఇంకా కావాలంటే సొంత డబ్బులు పెట్టుకోవాలి.
Deleteసన్నీలియోన్ కి భర్తతో కలిపి ఏడుగురు వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్నారు. నూతన సంవత్సర వేడుకలకు కర్నాటక ప్రభుత్వం ఆమెకు భద్రత కల్పించలేనని చెప్పి చేతులెత్తేసింది.
ReplyDeleteజనంలో కలిసితిరిగే వ్యక్తికి భద్రత ఎందుకండీ దండగ ?
అలిపిరి ఘటన = కోడి కత్తి ఘటన
ReplyDeleteప్రతిపక్షం ప్రజల కొరకు కొట్లాడాలి తప్ప వ్యక్తిగత ప్రతిష్ట కోసం కాదు. ఇంకా మీరే మా కళ్ళలో సీఎం అంటూ భజన చేసే గల్లా అరుణమ్మ లాంటి బట్రాజుల వలన ఒరిగే లాభం ఏమీ లేదు.
ReplyDeleteఇటువంటి తప్పుడు సలహాల బదులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి & కరణం బలరామకృష్ణమూర్తి లాంటి సీనియర్ మోస్ట్ నాయకులు చెప్తున్న హితవచనాలు చెవిన పెట్టడం మేలు.
ప్రజల కొరకు పోరాడాలి సందేహం లేదు, కానీ వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనిపించినప్పుడు ప్రతిఘటించడం కూడా తప్పక చెయ్యాలి, లేదంటే బలహీనతగా తీసుకుని ఎదుటివారు మరింత చెలరేగిపోయే ప్రమాదం ఉంటుంది కదా.
Deleteఆ, ఒక విషయం అంగీకరిస్తాను. తన భద్రతా ఏర్పాట్ల గురించి చంద్రబాబు గారు ఏకంగా కోర్టుకు వెళ్ళకుండా ... ముందు ప్రభుత్వంతో ఉత్తరప్రత్యుత్తరాలు జరిపితే బాగుండేది. దాన్ని బట్టి కోర్టుకు వెళ్ళాలా లేదా అని తేల్చుకునుండచ్చు. హైకోర్టులో ఓ ముక్క తగిలిద్దాం సార్, తీర్పు అనుకూలంగా రాకపోతే ఫుల్ బెంచ్ కోసం అడుగుదాం, అదీ మన వైపు జరగకపోతే సుప్రీంకోర్టు ఉండనే ఉంది .... అని వచ్చే సలహాలు, మీరే మీరే మాస్టారూ అనే వందిమాగధుల మాటలు వినడం అంత మంచిది కాదు కదా. ఇప్పుడు పరిస్ధితి ... కోర్టులో గనక చుక్కెదురైతే లోకువై పోయి ఎదుటి వారు మరింత ఇబ్బంది పెట్టే పనులు (discomfiture) చేసే ప్రమాదం ఉంటుంది. చంద్రబాబు గారి లాంటి అనుభవజ్ఞుడు ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారు?
విన్నకోట వారూ,
Deleteవిజయ్ గారు తన వ్యాఖ్యలో లెక్కలు చెప్పారు. వీటినే కోర్టులు కూడా ధృవీకరిస్తాయని నా నమ్మకం.
అనుకుల మీడియా భజన, వంధిమాగదుల ఓవరాక్షన్ వలన 120-130 సీట్లు రావాల్సిన జగన్ ఓట్ల సునామీతో ఏకంగా 151 స్థానాలు గెలిచాడు. "పిల్లకాకి" రాహుల్ గాంధీ పరిణితి చూసయినా నేర్చుకోవాలి కదా.
అగ్రవర్ణ (ముఖ్యంగా సొంత కులపోళ్ళు) ఎగువ మధ్యతరగతి పట్టణ ప్రాంత 1% జనాభా, అనగా base camp "సానుభూతి" తప్ప ఈ పరువు ప్రతిష్ట రచ్చల వలన ఒరిగేది ఏముంది? అసలే పార్క్ హయాత్ హోటల్ బిల్లులు, 9 కోట్ల రేకుల షెడ్డు వగైరా ఆడంబరాల చిట్టీ బయటపడుతుంది కనుక ఆ కాస్త మిగిలిన పరువు గంగలో కలవడం ఖాయం. జూనియర్ ఆర్టిస్టులతో "నువ్వు ఓడిపోవడం ఏందయ్యా" డ్రామాలు కూడా కొనసాగితే వీరాభిమానులకు కూడా వ్యాష్ట పుడుతుంది.
పార్టీ పరాజయానికి బాధ్యత స్వీకరిస్తూ రాహుల్ గాంధీ దేశచరిత్రలోనే అరుదయిన హుందాతనం చూపించాడు. వందిమాగధులు గడ్డం పట్టుకొని బామాలినా తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం అతని పరిణితి సూచిస్తుంది. ఎన్నికలలో గెలుపోటములు విషయం అటుంచి జవాబుదారీతనంలో రాహుల్ ప్రదర్శించిన పారదర్శికత తత్తిమ్మా నాయకులకు ఆదర్శంగా నిలుస్తుంది.
ReplyDeleteHatsoff Rahul!
Post a Comment