కొంతకాలంగా పోలీసులకు దొరకకుండా అజ్ఞాతంలో ఉంటున్న శివాజీని, ఇవాళ ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన అమెరికా వెళ్లడానికి ప్రయత్నిస్తూ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దొరికిపోయారు. అనంతరం సైబరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌కు ఆయనను తరలించి, సుమారు 3 గంటల పాటు విచారించి విడుదల చేశారు. మళ్ళీ 11వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా అందజేశారు.
టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాష్, శివాజీ కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి, తమను మోసం చేసి డైరెక్టర్ల నియామకాన్ని అడ్డుకున్నారని అలంద మీడియా ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో విచారణకు హాజరుకావాలని రవిప్రకాశ్‌తో పాటు శివాజీకి పోలీసులు, పలు మార్లు నోటీసులు జారీ చేశారు. విచారణను తప్పించుకోవడానికి ఇద్దరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, కోర్టు నుండి బెయిలు పొందే ప్రయత్నం చేశారు.
కోర్టులో ప్రయత్నాలు విఫలమవడంతో, రవిప్రకాశ్ పోలీసుల ఎదుట హాజరైనప్పటికి శివాజీ నుండి స్పందన లేదు. దానితో శివాజీపై సైబర్‌క్రైమ్ పోలీసులు దేశం విడిచి వెళ్లకుండా లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఎయిర్‌పోర్టుకు రాగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో అరెస్టు చేయగలిగారు.
విచారణకు హాజరయితే, ఒకవేళ అరెస్టు చేసినా సులభంగా బెయిలు దొరికే ఆర్థిక నేరానికి ఇంతకాలం పాటు కష్టపడి తప్పించుకుని తిరగటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. నేరారోపణ వలన ముఖం చెల్లకే ఇంతకాలం బయటకు రానట్లుగా భావిస్తున్నారు. కాగా, తెలంగాణ పోలీసులు మాత్రం, ఇంతకాలం ఎందుకు హాజరు కాలేకపోయాడో వాంగ్మూలం నమోదు చేసి, 11న విచారణకు హాజరు కావాలని 41 సిఆర్‌పిసి కింద నోటీసులు అందజేసి, విదేశాలకు వెళ్లకుండా పాస్‌పోర్టును సీజ్ చేసి ఇంటికి పంపించివేశారు.

Post a Comment