ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక కేటాయింపులూ లేవు


గత ఐదు సంవత్సరాలలో వలెనే, ఈ సంవత్సరం కూడా కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిరాశనే మిగిల్చింది. ప్రత్యేక హోదాతో సహా రాష్ట్ర విభజన హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం విస్మరించింది. రాజధాని నిర్మాణానికి కూడా నిధులు కేటాయించలేదు. దుగరాజపట్నం పోర్టు, కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాలు అసలు బడ్జెట్‌లో ప్రస్తావనకే రాలేదు. జిఎస్‌టి మరియు ఇతర పారిశ్రామిక మినహాయింపులు గాని, ప్రత్యేక ప్యాకేజీగాని లేవు. 

రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీకి 13 కోట్లు, ట్రైబల్ యూనివర్సిటీకి 8 కోట్లు కేటాయింపులు జరిపారు. కేంద్రం దేశ వ్యాప్తంగా మెట్రో ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంతో విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులపై కొన్ని ఆశలు కలుగుతున్నాయి. పత్తి కొనుగోలుకు మరియు ఫిషరీస్ రంగాలకు నిధులు కేటాయించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొంతమేర ఉపయోగం ఉండే అవకాశం ఉంది. 

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సంతృప్తికరంగా లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఈ బడ్జెట్ తీవ్ర నిరాశకు గురి చేసిందని, ప్రత్యేకహోదాతోపాటు విభజన చట్టంలోని అంశాలను పూర్తిగా విస్మరించారని టిడిపి అధినేత చంద్రబాబు విమర్శించారు.  

1/Post a Comment/Comments

  1. ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక కేటాయింపులూ లేవు కాని ప్రత్యేకావమానాలు మాత్రం తప్పకుండా ఉన్నాయి.

    ReplyDelete

Post a Comment

Previous Post Next Post