తెలంగాణ రాష్ట్ర పన్నులలో 57% హైదరాబాద్ నుండే


తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన మొత్తం పన్నులో, హైదరాబాద్ జోన్ వాటా 57 శాతమని రెండవ జిఎస్‌టి దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ గారు తెలిపారు. బకాయిల రికవరీలో కూడా ఇదే జోన్ మొదటి స్థానంలో నిలిచిందని ఆయన అన్నారు. పన్ను వసూలులో శ్రద్ధ, అభివృద్ధి చూపిన అధికారులను, మరియు నియమ నిబంధనలను సక్రమంగా పాటించి పన్నులను చెల్లిస్తున్న వ్యాపారులను కూడా ఈ సందర్భంగా సత్కరించారు. గత సంవత్సరం రాష్ట్రంలో, 1764 కోట్ల టాక్స్ రిఫండ్స్ చేసినట్లు ఆయన వెల్లడించారు. జిఎస్‌టికి సంబంధించిన అనుమానాలు తీర్చుకోవడానికి సేవా కేంద్రం, టోల్ ఫ్రీ నంబర్‌లను ఉపయోగించుకోవాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. 

ముఖ్య అతిథిగా హాజరయిన రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ అధికారులకు కొన్ని సూచనలు చేశారు. 
  • ప్రస్తుత కాలంలో పన్ను విధించే విధానం ఉదారంగా ఉండాలి
  • పన్ను చెల్లింపుదారులతో స్నేహపూర్వకంగా ఉండాలి 
  • పన్ను వసూలు చేసేవారు అప్రమత్తంగా ఉండటమే కాక పన్ను చెల్లింపుదారుల సమస్యలను కూడా అర్థం చేసుకునే స్థితిలో కూడా ఉండాలి.

0/Post a Comment/Comments

Previous Post Next Post