రేపు అర్ధరాత్రి దాటిన తరువాత పాక్షిక చంద్రగ్రహణం సంభవించనున్నది. దాదాపు మూడు గంటలు సాగే ఈ చంద్రగ్రహణాన్ని అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొంతభాగం మినహా, మనదేశంలో అన్నిప్రాంతాల నుండి వీక్షించవచ్చు. ఈ సంవత్సరానికి సంబంధించినంత వరకు ఇదే చివరి చంద్రగ్రహణం.
చంద్రుడు భూమి ఉపచ్ఛాయలోకి (Penumbra) ప్రవేశంతో చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో చందమామ చుట్టూ పలుచని నల్లటి పొర ఆవరించినట్లుగా కనిపిస్తుంది. ఆ తరువాత భూమి ఛాయ (Umbra -నీడ) లోకి రావడంతో అసలు గ్రహణం ప్రారంభమవుతుంది.
తెలుగు రాష్ట్రాలలో గ్రహణం(Umbra) 17వ తేదీ తెల్లవారుఝామున
ప్రారంభ సమయం 1.33 AM
ముగిసే సమయం 4.30 AM
అత్యధిక గ్రహణం కనిపించే సమయం - 3.01 AM
పాక్షిక చంద్రగ్రహణ మొత్తం సమయం - 02 గంటల 57 నిమిషాల 14 సెకెన్లు
భూమి ఉపచ్ఛాయ చంద్రునిపై పడడం ఆరంభమయ్యే సమయం - 12:15 AM
భూమి ఉపచ్ఛాయ చంద్రునిపై పడడం ముగిసే సమయం - 05:48 AM
మొత్తం ఉపచ్ఛాయ సమయం - 05 గంటల 32 నిమిషాల 49 సెకెన్లు
ఈ చంద్రగ్రహణం ఏర్పడే అన్ని ప్రాంతాలను నాసా వారు ప్రచురించిన ఈ మ్యాప్‌లో చూడవచ్చు.
Post a Comment