వైవి సుబ్బారెడ్డిపై 'వికీ' దాడి

వైవి సుబ్బారెడ్డి గారిని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌గా ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే ఆయనపై సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం, ఫేక్ న్యూస్ ట్రెండ్ అయ్యాయి. ఆయన క్రిస్టియన్ అని, టిటిడి పదవిని హిందువులకే కేటాయించాలనే వార్త వైరల్ అయ్యింది. కొందరు అయితే ఆయన చర్చి వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్‌కు పనిచేసారని కూడా ప్రచారం సాగించారు.    

వికీపీడియాలో సైతం ఆయన మతాన్ని గురించిన ప్రస్తావన లేదు. కానీ ఒకరు ఆయన వికీ పేజిలో ఆయన క్రిస్టియన్ అని చేర్చారు. ఆ వెంటనే మరొకరు హిందూగా మార్చారు. ఇలా వరుసగా మారుస్తూ పోయారు. కొన్నిసార్లు ఆ పేజి కన్వర్టెడ్ క్రిస్టియన్ అని కూడా చూపింది.  ఒక్క రోజులోనే ఈ పేజి దాదాపు వందసార్లు ఎడిట్ చేయబడటంతో చివరికి ఆ పేజి లాక్ చేయబడింది. వీటిలో అధికసార్లు 'చిత్రాడ' అనే యూజర్ ఆయన మతాన్ని క్రిస్టియన్ అని మార్చినట్లు తెలుస్తుంది. చర్చి వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్‌కు పనిచేస్తున్నారని కూడా ఆ యూజరే వికీ లో చేర్చాడు.
   

తనపై క్రిస్టియన్ అని జరుగుతున్న ప్రచారాన్ని వైవి సుబ్బారెడ్డిగారు ఖండించి, టీవీ చానెళ్లలో వివరణ ఇచ్చారు. తాను హిందువునని, తన ఇంటిలో గోపూజ జరుగుతుందని, వేంకటేశ్వరుడు తన ఇష్ట దైవమని తన మెడలో ఉన్న స్వామివారి లాకెట్ వంటి వాటిని చూపించారు. ఆయన ఎన్నికల అఫిడవిట్లలో కూడా తాను హిందువుననే పేర్కొన్నారు. ఆయన ఇంట్లో నిత్యార్చన జరుగుతుంది. పది సార్లకు పైగా అయ్యప్ప మాల ధరించి, శబరిమలను సందర్శించిన వ్యక్తి.

ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నామినేటెడ్ పదవులలో టిటిడి ఛైర్మన్ పదవిని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. క్యాబినెట్ హోదా పదవి కన్నా ఎక్కువ డిమాండ్ దానికి ఉంది. ఆ పదవికి ఎవరు ఎంపికైనా, వారిపై ప్రతిపక్షంగాని, ఆ పదవిని ఆశించిన ఇతరులుగాని దుష్ప్రచారం చేయడం, ఈ మధ్య రివాజుగా మారింది. అంతేకాక తిరుమల మన రాష్ట్రంలో మెజారిటీ మతస్తులైన హిందువులకు అతి ముఖ్య పుణ్యక్షేత్రం. ప్రభుత్వం మత సాంప్రదాయాలను గౌరవించడం లేదని ప్రచారం చేయడం వలన అధికార పక్షంపై ప్రజలలో వ్యతిరేకత వస్తుందనే భావనతోనే వారు ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post