మిత్రపక్షమే ప్రధాన ప్రతిపక్షమా?

తెలంగాణ శాసనసభలో విచిత్రం చోటుచేసుకోనుంది. టిఆర్ఎస్ పార్టీ తన మిత్రపక్షమైన ఎంఐఎం పార్టీని ప్రధాన ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టడానికి రంగం సిద్ధం చేసింది. గత రెండు, మూడు రోజులలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఎంఐఎం సభలో రెండవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 

సాధారణంగా అధికార పక్షాలు సభలో,  రెండవ పెద్ద రాజకీయ పక్షానికి పదో వంతు బలం లేకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదాను ఖాళీగా ఉంచుతాయి గాని ఆ పార్టీకి దక్కనివ్వవు. కానీ ఇక్కడ మిత్ర పక్షమే కావడంతో టిఆర్ఎస్ సానుకూలంగా స్పందించనుంది. 

ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభించే సౌకర్యాలు 
  • పార్టీ అధినేతకు క్యాబినెట్ హోదా 
  • పిఎసి చైర్మన్ పదవి 
  • ఇంతకు ముందు డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా ప్రధాన ప్రతిపక్షానికి ఇచ్చే సాంప్రదాయం ఉండేది. కానీ గత రెండు, మూడు దశాబ్దాల నుండి ఇది అంతరించిపోయింది. 
ఇలా శాసన సభలో కాంగ్రెస్ పార్టీని విలీనం చేసుకోవడం మరియు ఎంఐఎం పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించనుండటాన్ని టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బలహీన పరచడం ద్వారా రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో బలపడుతూ, మరిన్ని అవకాశాల కోసం వేచి చూస్తున్న బిజెపికి ఇది కలసిరానుంది. ఎంఐఎంతో టిఆర్ఎస్ చేస్తున్న స్నేహం కూడా బిజెపి తరహా రాజకీయాలకు మరింత బలాన్ని ఇస్తుంది. 

0/Post a Comment/Comments

Previous Post Next Post