క్రికెట్‌కు యువరాజ్‌ సింగ్‌ గుడ్‌బై

ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ మరియు ఐపిఎల్ క్రికెట్‌ నుండి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఆయన తన 17 ఏళ్ల కెరీర్‌లో 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టి20 మ్యాచ్‌లు ఆడాడు. విధ్వంసకరమైన బ్యాట్స్‌మన్‌గా, ఆల్ రౌండర్‌గా మరియు అద్భుతమైన ఫీల్డర్‌గా పేరుపొందాడు. యువరాజ్ ఇవాళ ముంబైలోని ఓ హోటల్‌లో మీడియాతో సమావేశమై "తాను (జీవితంలో క్రికెట్‌ ఆడటాన్ని దాటి) ముందుకు సాగాలని నిర్ణయించానని" లాంఛనంగా ప్రకటించాడు.

నిర్ణయాన్ని ప్రకటిస్తూ యువరాజ్ భావోద్వేగంతో స్పందించాడు. ఆయన ప్రసంగం పూర్తి పాఠం.  

"ఇది చాలా కష్టమైన మరియు అందమైన క్షణం. 22 గజాలలో 25 సంవత్సరాల పాటు క్రికెట్, మరియు సుమారు 17 సంవత్సరాల అంతర్జాతీయ క్రికెట్ తర్వాత, నేను ముందుకు వెళ్తున్నాను. దేశం కోసం నాలుగువందలకు పైగా మ్యాచ్‌లు ఆడటాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. ఒక క్రికెటర్ గానే జీవితాన్ని ప్రారంభించాను. ఆటలో ఎత్తుపల్లాలు చూసాను. జీవితాంతం ఆటను ప్రేమిస్తూనే ఉంటాను. నా ఈ భావనను మాటలలో వ్యక్తపరచలేకపోతున్నాను" 

"ఎలా పోరాడాలి, ఎలా వదులుకోవాలి అనేవి ఈ ఆటే నాకు నేర్పింది, కిందపడటం, పైకి లేవడం మరియు ముందుకు సాగడం వంటివి అన్నీ ఇక్కడే నేర్చుకున్నాను. నేను ఎన్నిసార్లు విఫలమైనా మళ్ళీ విజయం సాధించాను, ముఖ్యంగా నా దేశానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు నా రక్తం, చెమట చిందేలా ప్రయత్నించాను."

"మ్యాచ్‌కు ముందు జాతీయ గీతాన్ని పాడటం, భారత జెండాను తాకడం, దేశం కోసం ఒక్కొక్క పరుగుని సాధించడం లేదా పరుగుని ఆపటం నాకు ఉద్వేగాన్నిస్తాయి. 28 సంవత్సరాల తరువాత (2011 లో), మేము చరిత్రను సృష్టించాము, నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి?" 

0/Post a Comment/Comments

Previous Post Next Post