డేటా చౌర్యం కేసులో పరారీలో ఉన్న నిందితుడు, ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు ముందస్తు బెయిల్ లభించింది. తెలంగాణ హై-కోర్టు ఆయనకు పలు షరతులతో కూడిన ఈ బెయిల్‌ను మంజూరు చేసింది. పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని, హైదరాబాద్ విడిచి వెళ్లరాదని, రోజూ పోలీసుల ఎదుట హాజరు కావాలని, విచారణకు సహకరించాలని షరతులు విధించింది.
తనపై తప్పుడు కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలనుకుంటున్నారని అశోక్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన విచారణకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నారని, భారీ స్థాయిలో డేటా చౌర్యం జరిగిందని, ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని ప్రభుత్వ న్యాయవాది వాదించినా ఫలితం లేకపోయింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజల ఆధార్, ఓటర్, ఇతర వ్యక్తిగత సమాచారాన్నిచోరీ చేసి, వాటిని అక్రమంగా నిలువ ఉంచారని, దురుపయోగం చేస్తున్నారని అశోక్‌పై, ఐటీ గ్రిడ్స్ సంస్థపై కేసులు నమోదయ్యాయి. స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలోని సిట్ ఈ కేసును విచారిస్తుంది. ఇంత ప్రాధాన్యమున్న కేసులో పరారీలో ఉన్నప్పటికీ బెయిల్ తెచ్చుకోగలగడం, ఆయన చాకచక్యమేనని ఒప్పుకోవలసిందే.
Post a Comment