కాశ్మీరులో ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడలు - బుల్లెట్ ప్రూఫ్‌ను ఛేదించే స్టీలు బుల్లెట్ల వాడకం

కాశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లాలో గత జూన్ 12న ఉగ్రవాదులు, భద్రతా దళాలపై జరిపిన దాడిలో ఐదుగురు సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మృతి చెందగా,  ఒక పోలీసు అధికారితో సహా మరికొందరు గాయపడ్డారు. చనిపోయిన ఉగ్రవాదిని జైష్-ఎ-మొహమ్మద్ సంస్థకు చెందిన వాడిగా గుర్తించామని, దాడిలో వారు బుల్లెట్ ప్రూఫ్‌ దుస్తులను ఛేదించే స్టీలు బుల్లెట్లను వాడారని అధికారులు తెలియజేశారు. 

2017లో కూడా రెండు సార్లు జైష్ ఉగ్రవాదులు స్టీలు బుల్లెట్లను ఉపయోగించి దాడి చేశారు. 2018లో ఈ తరహా బుల్లెట్లతో దాడులు జరగలేదు. ఆ తరువాత మళ్ళీ వారి వద్ద నుండి ఈ బుల్లెట్లు లభ్యం కావడం ఇదే తొలిసారి. ఇప్పుడు, బుల్లెట్ ప్రూఫ్‌ దుస్తులను ధరించిన తరువాత కూడా సిఆర్‌పిఎఫ్ సిబ్బంది మృతి చెందడం, అధికారులను కలవరపరుస్తోంది. 

ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, స్టీలు బుల్లెట్లు కూడా ఛేదించని బుల్లెట్ ప్రూఫ్‌ దుస్తులను తెప్పిస్తున్నామని తెలిపారు. కాని, వాటి బరువు ఎక్కువగా ఉండడంతో పరిష్కార మార్గాలను యోచిస్తున్నామని అన్నారు. ఈ విషయమై ఢిల్లీలోని అధికారులను, శాస్త్రవేత్తలను కూడా సంప్రదించామని కూడా తెలిపారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post