ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం, ముఖ్యమంత్రి కెసిఆర్ గారి మరో కల సాకారమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన ప్రజలకు అంకితమిచ్చారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకమైన ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి, గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్ననిస్‌లు ముఖ్య అథితులుగా హాజరయ్యారు.
మేడిగడ్డలో కెసిఆర్ గారు ముందుగా జల సంకల్ప హోమం జరిపించారు. ఆ తరువాత గవర్నర్ నరసింహన్, ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులతో కలిసి కెసిఆర్, బరాజ్ వద్ద ఏర్పాటు చేసిన శిలా ఫలకం వద్దకు చేరుకున్నారు. కొబ్బరి కాయలు, గుమ్మడి కాయ కొట్టిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు శిలాఫలకాన్ని జగన్ ఆవిష్కరించారు. రిబ్బన్ కట్ చేసి బరాజ్‌ను కెసిఆర్ ప్రారంభించారు.
ప్రారంభోత్సవ ఘటనల క్రమం
11.23 - మేడిగడ్డ బరాజ్ వద్ద ఏర్పాటు చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు శిలా ఫలకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
11.26 - మేడిగడ్డ బరాజ్‌ను కెసిఆర్ ప్రారంభించారు.
12.18 - హెలికాప్టర్‌లో కన్నెపల్లి పంప్‌హౌజ్‌వద్దకు చేరుకున్నారు.
12:46 - శిలాఫలకం ఆవిష్కరణ
12:48 - రిబ్బన్ కట్ చేసి కన్నెపల్లి పంప్‌హౌజ్ ప్రారంభోత్సవం
01.07 - కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను స్విచ్ఛాన్
01.15 - నీటి పంపింగ్ ప్రారంభం
ఇదేరోజు, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్నారం బరాజ్‌ను నిరంజన్ రెడ్డి గారు, అన్నారం పంప్‌హౌస్‌ను మహమూద్ అలీ గారు, సుందిళ్ల బరాజ్ మరియు పంప్‌హౌస్‌ను కొప్పుల ఈశ్వర్ గారు, నంది మేడారం పంప్‌హౌస్‌ను మల్లారెడ్డి గారు, లక్ష్మీపూర్ పంప్‌హౌస్‌ను జగదీశ్ రెడ్డి గారు ప్రారంభించారు.
Post a Comment