ప్రత్యేక హోదా ఉద్యమకారులపై దేశద్రోహ కేసులా?

మంగళవారం నాడు అమరావతిలో కలెక్టర్లు, ఎస్‌పిలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమావేశమయిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ పోలీసులు దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉండాలని ఆకాంక్షించారు. ప్రత్యేక హోదా ఆందోళనలపై ఉన్న కేసులన్నింటినీ ఎత్తివేయాలని ఆయన సూచించారు.  

మంత్రి కురసాల కన్నబాబు, ఉపముఖ్యమంత్రి అంజాద్‌ బాషాలు, గుంటూరులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట ఓ కార్యక్రమంలో ప్రత్యేక హోదా ప్లకార్డులు ప్రదర్శించినవారిపై దేశద్రోహం కేసు పెట్టారని వివరించారు. ఈ విషయంపై జగన్ విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి సంజీవని లాంటి హోదా కోసం ఉద్యమిస్తే అన్యాయంగా దేశద్రోహం కేసులు పెడతారా?, ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఇలా వ్యవహరిస్తే వ్యవస్థల మీద నమ్మకం పోతుందని, తక్షణమే ఆ కేసులన్నింటిని ఎత్తివేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీసులు కూడ మనవాళ్లే అని ప్రజలు అనుకొనేలా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలను చిరునవ్వుతో పలకరించవలసిందిగా కూడా సూచించారు.

0/Post a Comment/Comments