శాసనసభలో చర్చ సందర్భంగా వైసిపి సభ్యులు, చంద్రబాబు గారిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి గారు కూడా దీనిలో పాలుపంచుకోవడం విశేషం.
జగన్ గారు మాట్లాడుతూ 'రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉంది అని చెప్పే వాళ్ళలా, 2029లో ఏదో చేస్తాం.. 2050లో ఏదో సాధిస్తామని నేను చెప్పను. మేమేం చేయగలమో అది ఇప్పుడే చేసేస్తున్నాం.' అంటూ చంద్రబాబు గారు మాట్లాడే మాటలను అనుకరిస్తూ ఎద్దేవా చేశారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మాట్లాడుతూ '29 సార్లా.. 39 సార్లా.. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లామన్నది కాదు. ఏం సాధించామన్నదే ముఖ్యం' అని అన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు ఈ ప్రస్తావన తెచ్చినప్పుడు ఆయన జోక్యం చేసుకుంటూ 'చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడల్లా శాలువాలు, వీణలు, లడ్డూలు, ప్రసాదాలిచ్చారు. మీరు ఇక్కడనుంచి పట్టుకెళ్లి కప్పిన శాలువాలు దాచుకోవడానికి అక్కడి బీరువాలు సరిపోలేదని' వ్యంగ్యంగా అన్నారు.
ప్రత్యేక హోదా కోసం తాము కృషి చేశామన్న చంద్రబాబు మాటలకు స్పందిస్తూ 'కుట్ర, దగా, మోసం చేసే వాళ్లకు డాక్టరేట్లు ఇచ్చే విశ్వవిద్యాలయం ఏదైనా ఉంటే అది చంద్రబాబుకే ఇస్తుందని' కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు.
Post a Comment