ఎట్టకేలకు పోలీసుల ముందుకు రవిప్రకాశ్

నేరారోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న TV9 ఛానల్ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌, నిన్న సాయంత్రం నాలుగున్నరకు పోలీసుల ముందుకు వచ్చాడు. ఆ సమయానికి అక్కడ వేచి ఉన్న విలేఖరులను పలకరిస్తూ సైబరాబాద్‌ సైబర్‌ క్రైం కార్యాలయంలోకి ప్రవేశించాడు. ఆయనను పోలీసులు దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా దాటవేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తుంది. ఏ ప్రశ్న అడిగినా ఆ సమయంలో తాను లేనని, తనకు గుర్తు లేదని, తన లాయర్లను అడగాలని సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. సమయం మించిపోతుండటంతో పోలీసులు, ఇవాళ ఉదయం మళ్ళీ హాజరు కావాలని ఆయనకు నోటీసులు అందచేసి పంపించివేశారు.     

రవిప్రకాష్ బయటకు వచ్చిన తరువాత విలేఖరులతో మాట్లాడుతూ టీవీ9ను ఇద్దరు ధనికులు అక్రమంగా కొన్నారని, తనను అక్రమంగా బోర్డు మీటింగ్ పెట్టి బయటకు పంపించారని, ఇది  మాఫియాకు, మీడియాకు జరుగుతున్న ధర్మయుద్ధమని అన్నారు. తాను పోలీసు విచారణకు సహకరిస్తున్నానని కూడా తెలిపారు.    

ఒక సంస్థలో పనిచేసే వ్యక్తి ఆ సంస్థ యజమానులు దానిని ఎవరికి అమ్మాలో, ఎవరు కొనాలో నిర్ణయిస్తాను అనడం, కొనుక్కున్న వాళ్ళను మాఫియా అనడం విచిత్రంగా ఉంది. ఆ సంస్థ లోగోలను పనిచేసే వ్యక్తి, తన సొంత సంస్థకు ఎలా అమ్ముకుంటాడు?, ఇన్నాళ్లు ఎందుకు పరారీలో ఉన్నారు? అనే ప్రశ్నలను ఆయన పట్టించుకోలేదు.
  
ఏ ఇతర మీడియా సంస్థ, రవిప్రకాష్ గారికి అనుకూలంగా స్పందించలేదు. సాటి జర్నలిస్టులలో కూడా ఆయన పట్ల సానుభూతి లేకపోవడం గమనార్హం. తాను ఒక సంస్థకు అధినేతనన్నట్లు అహంకారంతో, విపరీతమైన సుపీరియారిటీ కాంప్లెక్స్‌తో వ్యవరించేవాడని, ఇతర జర్నలిస్టులతో పెద్దగా కలిసేవాడు కాదని వార్తలు వచ్చాయి. 

తెలంగాణ వాదులలో కూడా రవిప్రకాశ్ పట్ల ప్రత్యేకంగా ద్వేష భావం ఉంది. తెలంగాణ ఉద్యమం ఉద్ధృతమయ్యే వరకు కూడా తెలంగాణ యాసతో మాట్లాడేవారెవరిని ఆయన సంస్థలోకి తీసుకునేవాడు కాదు. ఆ ప్రాంత భాష, ఉచ్చారణ మీడియాకు పనికిరావు అని స్వయంగా వ్యాఖ్యానించేవాడు. 2009 తర్వాత కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తమ ఛానల్ ద్వారా వార్తలను, భావజాలాన్ని వ్యాపింపచేయటానికి  ప్రయత్నించేవాడు. మరోవైపు వైసిపి అభిమానులకు కూడా ఆయనపై 'వ్యతిరేక ప్రోపగండా' వ్యాప్తి చేయడానికి ప్రయత్నించాడనే భావన ఉండడం గమనార్హం.

అరెస్టు తప్పదా?

రవిప్రకాశ్‌ ముందస్తు బెయిలును ముందు హైకోర్టు, తరువాత సుప్రీం కోర్టు తిరస్కరించాయి. తెలంగాణ పోలీసులు కూడా ఆయన కోసం వెతుకులాటను ముమ్మరం చేయడంతో గత్యంతరం లేకే వారి ముందుకు వచ్చినట్లు తెలుస్తుంది. పోలీసుల విచారణకు సహకరించకుండా పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంతో ఆయన అరెస్టు తప్పక పోవచ్చని తెలుస్తుంది. 

రవిప్రకాష్‌పై నకిలీ కొనుగోలు పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, కుట్ర మరియు ఫోర్జరీ ఆరోపణలపై ఐటీ యాక్ట్, 66, 72 ఐపీసీ 406, 420, 467, 468, 469, 471, 120(బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post