మన దేశం ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌లతో ఆడే ప్రపంచ కప్ మ్యాచ్‌లలో పాకిస్తాన్ అభిమానులు మన దేశానికి మద్ధతునివ్వనున్నారు. ఎప్పుడూ మన ఓటమిని కోరుకునే వారు మనం గెలవాలనుకోవటమేమిటి? అని అంటారా. వారు సెమి-ఫైనల్ చేరే అవకాశాలు మెరుగు పడాలంటే ఆ రెండు మ్యాచ్‌లు మనం గెలవాలి మరి. సమీకరణలు మారితే శ్రీలంకతో ఆడే మ్యాచ్‌కు కూడా వారు మద్ధతు ఇవ్వవచ్చు.
ఇప్పటికే కొంతమంది పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, మనదేశం బంగ్లాదేశ్‌తో కావాలని ఓడిపోనుందని ఆరోపణలు చేస్తున్నారు. అలా చేయడం ద్వారా పాకిస్తాన్ సెమి-ఫైనల్ చేరే అవకాశాలు తగ్గిపోతాయి. మన దేశం అలాంటి ఎత్తుగడలకు పాల్పడదని వారికి తెలియదు కదా.
1992లో న్యూజీలాండ్ స్వదేశంలో సెమీఫైనల్ ఆడాలని, లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో కావాలని ఓడి వారిని సెమీస్‌కు వచ్చేలా చేసింది. కాని, ఆ సెమీఫైనల్లో వారితోనే ఓడిపోయింది.
Post a Comment