పోలవరం నుండే ఉత్తరాంధ్ర, తెలంగాణలకు? తుపాకులగూడెం నుండి రాయలసీమకు?

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. పూర్తిగా సుహృద్భావ వాతావరణంలో ఈ చర్చలు సాగినట్లు తెలుస్తుంది. వార్తలలో రెండు ఎత్తిపోతల పథకాలు అని ప్రముఖంగా వచ్చినప్పటికీ, నాలుగు మల్టి-స్టేజ్ ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు అవకాశముంది.

గోదావరి నుండి శ్రీశైలం మరియు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు రోజుకు నాలుగు/ఐదు టిఎంసిలు ఎత్తిపోసే సామర్థ్యంతో కొత్త ప్రాజెక్టులు రానున్నాయి ప్రాణహిత, ఇంద్రావతి, శబరి ఉపనదులు గోదావరిలో కలిసిన తరువాత ఉన్న నీటి లభ్యత ఆధారంగా ఎత్తిపోతల ప్రాజెక్టులు డిజైన్ చేయనున్నారు. 
  • వేలేరు ఎత్తిపోతల ద్వారా పోలవరం నుండి విశాఖపట్నానికి నీటిని తరలించనున్నారు. ఇదే కాకుండా వంశధార, నాగావళి, నదుల నీళ్లను సమర్థంగా ఉపయోగించుకుంటే ఉత్తరాంధ్రలో నీటి కొరత ఉండదని కెసిఆర్ ప్రతిపాదనలలో ఒకటిగా ఉంది. 
  • నాగార్జున సాగర్‌కు నీటిని తెచ్చే విషయంలో అధ్యయనానికి రెండు ప్రత్యామ్నాయాలు సూచించారు. దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్‌కు నేరుగా మళ్లించడం. పోలవరం నుంచి మున్నేరు మీదుగా పులిచింతలకు, నాగార్జునసాగర్‌కు ఎత్తిపోయడం. ఈ రెండింటిలో దేనికి తక్కువ ఖర్చవనుందో దానినే చేపట్టనున్నారు.    
  • తుపాకులగూడెం లేదా అకినేపల్లి నుంచి శ్రీశైలంకు, అక్కడి నుండి నీటిని రాయలసీమకు తరలించనున్నారు.  
తెలంగాణకు సంబంధించినంత వరకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల నీటి అవసరాలు నాగార్జున సాగర్ నుండి, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు శ్రీశైలం నుండి తీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దాదాపు మొత్తం రాష్ట్రం ఈ ఎత్తిపోతల పథకం ద్వారా లబ్ది పొందనుంది.   

0/Post a Comment/Comments