పాకిస్తాన్, తమ గగనతలంపై భారత్ నుండి వచ్చే విమానాలపై ఉన్న నిషేధాన్ని జూన్ 28వ తేదీవరకు పొడిగించింది. ఆ దేశ సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA), ఈ ప్రకటన జారీ చేసింది. గత నిషేధం 15న ముగియనుండడంతో ఈ పొడిగింపు ప్రకటన వెలువడింది.
బాలాకోట్ వైమానిక దాడుల తరువాత ఇరు దేశాలమధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో విమానాల రాకపోకలపై నిషేధాలు విధించబడ్డాయి. మనదేశం ఈ నిషేధాన్ని మే31న ఎత్తివేసింది. కాని, పాకిస్తాన్ మాత్రం మూడవసారి కూడా పొడిగించడం ద్వారా కొనసాగించదలచుకున్నట్లు స్పష్టం చేసింది.
పాకిస్తాన్ విధించిన ఈ గగనతల నిషేధం వలన భారత్ - ఆఫ్ఘనిస్తాన్ల మధ్య రాకపోకలు, ఎగుమతి, దిగుమతులు కఠినతరమయ్యాయి. మన దేశం నుండి కాబూల్, ఆస్తానా, మాస్కో మరియు టెహ్రాన్ కు వెళ్లే మార్గాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. అమెరికా మరియు యూరోప్ వెళ్లే మార్గాలలో కూడా కొంత సమయం, దూరం ఎక్కువయ్యాయి. ఇరుదేశాల విమానయాన సంస్థలు భారీ స్థాయిలో నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. ఎక్కువగా నష్టపోయిన మూడు విమానయాన సంస్థలలో ఎయిర్ ఇండియా, పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ మరియు స్పైస్ జెట్ ఉన్నాయి.
పాకిస్తాన్ విమానాలు మనదేశ గగనతలాన్ని ఉపయోగించుకోవడం కన్నా, మనదేశ విమానాలు ఆ దేశ గగనతలాన్ని ఉపయోగించుకోవడం అనేది చాలా ఎక్కువ. అందువల్ల ఈ నిషేధం కొనసాగినకొద్దీ ఎక్కువ నష్టం కలిగేది మనదేశానికే.
పాకిస్తాన్ విమానాలు మనదేశ గగనతలాన్ని ఉపయోగించుకోవడం కన్నా, మనదేశ విమానాలు ఆ దేశ గగనతలాన్ని ఉపయోగించుకోవడం అనేది చాలా ఎక్కువ. అందువల్ల ఈ నిషేధం కొనసాగినకొద్దీ ఎక్కువ నష్టం కలిగేది మనదేశానికే.
Post a Comment