చిన్మయిపై విమర్శలు

చిన్మయి శ్రీపాద, దక్షిణ భారత సినిమా రంగంలో గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిరపరిచితురాలు. ప్రముఖ నటి సమంతకు సన్నిహితురాలు కూడా అయిన చిన్మయి, సోషల్ మీడియా పోస్టులతోనే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తలలోకి వస్తున్నారు. ఇప్పుడు ఆమె భర్త దర్శకత్వం వహించిన మన్మథుడు-2 సినిమాను ప్రమోట్ చేయడం ఆమెపై విమర్శలకు కారణమైంది. 

సినిమా రంగంపైనే కాకుండా సామాజిక సమస్యలపై కూడా స్పందించే చిన్మయి, ట్విట్టర్లో మిలియన్‌కు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. మీటూ ఉద్యమం సందర్భంగా ఆమె, తమిళ రైటర్ వైరముత్తుపై చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. డబ్బింగ్ ఆర్టిస్టుల సంఘానికి వ్యతిరేకంగా కూడా ఆమె ఉద్యమించారు. ఆ రెండు సందర్భాలలో నెటిజన్ల మద్ధతు పొందిన చిన్మయి, ఇప్పుడు వారి విమర్శలను ఎదుర్కుంటున్నారు.         

ఈ ఏడాది జనవరిలో చిన్మయి "తండ్రి వయసున్న హీరోలు తమ కూతురి వయసుండే హీరోయిన్లతో రొమాన్స్ చేయడం మన ఫిలిం ఇండస్ట్రీలో సాధారణం అని.. ఈ ట్రెండ్ ఇంకా అగలేదు.. ఆగిందా?"  అంటూ ట్వీట్ చేసింది.


ఇప్పుడు దానిని చూపుతూ, మన్మథుడు-2 సినిమాలో కూడా హీరో, కూతురు వయసు కన్నా తక్కువ వయసున్న హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. అటువంటి సినిమాను మీరు ఎలా ప్రమోట్ చేస్తారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. మీ భర్త సినిమా అయితే, ఎలా ఉన్నా పరవాలేదా? కేవలం పబ్లిసిటీ పిచ్చితోనే అప్పట్లో ట్వీట్లు చేశావా? లాంటి ఎన్నో విమర్శలు వస్తున్నాయి. 

చిన్మయి మన్మథుడు-2 సినిమాను ప్రమోట్ చేసిన ట్వీట్  
ఈ విమర్శలకు చిన్మయి సమాధానమిస్తూ, నా భర్త నా కన్నాపెద్ద ఫెమినిస్ట్ అని, సినిమా విడుదలయ్యాక ఎందుకు ప్రమోట్ చేసానో అందరికీ అర్థమవుతుందని అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post