జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్నికల ప్రచార సమయంలో కొంతమంది అభ్యర్థులు గెలిస్తే మంత్రి పదవులు ఇస్తామని హామీలు ఇచ్చారు. ఇలా హామీని పొందిన వారిలో మంగళగిరిలో లోకేశ్‌పై గెలుపొందిన ఆళ్ల రామకృష్ణా రెడ్డితో పాటు, మఱ్ఱి రాజశేఖర్ (చిలకలూరిపేట), అంజాద్ భాషా (కడప) మరియు బాలినేని శ్రీనివాస రెడ్డి (ఒంగోలు)లు ఉన్నారు.
ఈ నలుగురు అభ్యర్థులూ, గెలుపొందగా మంత్రివర్గంలో ఇద్దరికి మాత్రమే స్థానం లభించింది. ఆళ్ల రామకృష్ణా రెడ్డి, మఱ్ఱి రాజశేఖర్‌లకు మొండిచేయి ఎదురయింది. మాట తప్పను, మడమ తిప్పను అని పదే పదే చెప్పే జగన్ మాటపై వెనక్కు వెళ్తాడని ఇప్పుడే భావించలేం. రెండున్నర సంవత్సరాల తర్వాత వారికి స్థానం కల్పించే అవకాశముంది.
వైసిపి నుండి ఏకంగా 150 మంది గెలవడంతో అందరినీ సంతృప్తి పరచడం క్లిష్టంగా మారింది. శాసనసభ బలంలో కేవలం 15% మందినే మంత్రులుగా తీసుకునే అవకాశముండడం, సామాజిక, ప్రాంతీయ సమీకరణాల వలన వీరికి మంత్రిపదవులు ఇవ్వడం కష్టంగా మారిందని ఆ పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శ్రీకాంత్ రెడ్డి గారు కూడా మంత్రి పదవిని ఆశించినా చీఫ్ విప్ పదవితో సరిపెట్టుకున్నారు. రెండున్నర సంవత్సరాల తరువాత కూడా ఈ పరిస్థితి పెద్దగా మారే అవకాశం లేదు. రామకృష్ణా రెడ్డి, రాజశేఖర్‌ల ఆశలు నెరవేరుతాయో? లేదో? వేచి చూడాలి.
Post a Comment