హామీలు నావి - అమలు బాధ్యత మాత్రం మీదే

చంద్రబాబు నాయుడు గారు 2014 ఎన్నికలలో అలవిగాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. తరువాత వాటి ఆచరణ కోసం కమిటీలు వేసి, తరువాత హామీలలో అనేక మినహాయింపులు ఇచ్చి, చివరకు  అవికూడా అమలు చేయలేక చేతులెత్తేశారు. వీటిలో రైతులకు, డ్వాక్రా మహిళలకు సంపూర్ణ ఋణమాఫీలు ముఖ్యమైనవి.   

ఆ ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, "విభజన తరువాత రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఋణమాఫీ సాధ్యం కాదు" అని అంటే, చంద్రబాబు గారు "జగన్‌కు అనుభవం లేదు, ఆయనకు పరిపాలన ఏం తెలుసు? ఏమీ చేతకాదు. నేర్చుకోవాలని కూడా అనుకోరు. నా అనుభవంతో మాఫీ చేసి చూపిస్తాను." అంటూ నోటికి వచ్చినట్లుగా మాట్లాడేవారు.   

చంద్రబాబు గారు అధికారంలోకి రాగానే ముందుగా వారి పార్టీ వెబ్‌సైట్లోంచి మ్యానిఫెస్టోని మాయం చేశారు. రైతు ఋణాలపై కమిటీని వేసి సంపూర్ణంగా కాకుండా, 1.5 లక్షలు మాత్రమే మాఫీ చేస్తామని మాట మార్చారు. ఐదు సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించి కూడా దానిని పూర్తి చేయలేకపోయారు. ఐదు విడతలుగా చేస్తామని చెప్పి, కేవలం మూడు విడతల నిధులనే విడుదల చేయగలిగారు. ఇక డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీని పూర్తిగా అటకెక్కించేసారు. అధికారం చివరిలో పసుపు - కుంకుమ పేరిట, మళ్ళీ వారిని మభ్యపెట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత, ఆ ఋణమాఫీ బకాయిలను జగన్ చెల్లించాలని అంటున్నారు. 

2014 లో అబద్దపు హామీలతో ప్రజలను తప్పుదారి పట్టించడానికి పనికివచ్చిన "అనుభవం", అప్పట్లో "ఏమీ చేతకాదు" అని నిందించిన వారిదే "బాధ్యత" అని అంటుంది.

0/Post a Comment/Comments