దర్శకుడు వినాయక్ భవనం కూల్చివేత

ప్రముఖ దర్శకుడు వినాయక్‌కు చెందిన అక్రమ భవనాన్ని జిహెచ్ఎంసి కూల్చివేసింది. 111 జీవోకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టారని రెండుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన స్పందించకపోవడంతోనే ఈ పని చేసినట్లు అధికారులు వెల్లడించారు.   

వట్టినాగులపల్లి గ్రామ పరిధిలో అనుమతి లేకుండా ఆరు అంతస్థుల భవనాలు నిర్మిస్తున్నట్లు జిహెచ్ఎంసికి ఫిర్యాదులు వెళ్లాయి. అక్కడ  వారు అక్కడ రెండు అంతస్తుల కోసం అనుమతి తీసుకొని ఆరు అంతస్తులు నిర్మిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. వినాయక్ గారి భవనంతో పాటు పక్కన మరో భవనాన్ని కూడా అధికారులు కూల్చివేశారు. ఈ విషయంపై వినాయక్ గారు ఇంకా స్పందించలేదు. ఆ  ప్రాంతంలో మరిన్ని అక్రమ నిర్మాణాలున్నట్టు తేల్చిన మున్సిపల్‌ అధికారులు, వాటిని కూడా కూల్చివేయనున్నట్లు ప్రకటించారు.  

0/Post a Comment/Comments

Previous Post Next Post